పెద్దవంగర,మే20 : ఓవైపు మండుటెండలు.. దంచి కొడుతుండడంతో మండలంలోని పోచంపల్లి గ్రామ మెయిన్ రోడ్డు నివాస గృహాలకు నీటి కష్టాలు తప్పడం లేదు. కొద్దిరోజులుగా బోరు మోటర్ రిపేర్ రావడంతో నీటి సమస్య ఏర్పడింది. దాంతోపాటు మిషన్ భగీరథ నీరు సైతం సరిగా రావడం లేదని నివాస గృహాల ప్రజలు తెలిపారు.
బోరు మోటర్ సమస్య రావడంతో మోటార్ పంపుసెట్లు తీసేందుకు గ్రామ పంచాయతీ కార్మికులు అష్ట కష్టాలు పడ్డారు. నీటి సమస్య ఏర్పడడంతో జీపీ ట్యాంకర్ సహాయంతో నివాస గృహాలకు నీటిని సరఫరా చేశారు. దీనిపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా రెండు రోజులుగా మెయిన్ రోడ్డు గృహ నివాసాలకు సమస్య ఏర్పడిందని, త్వరలోనే పూర్తిస్థాయిలో పనులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తామన్నారు.