పర్వతగిరి, నవంబర్ 24 : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు వెళ్లి వివరించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ టీఆర్ఎస్ నాయకులకు సూచించారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మండల స్థాయి సమీక్ష గురువారం నిర్వహించి. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఏమైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు.
ప్రజా ప్రతినిధులు, నాయకులు కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి సమష్టి నిర్ణయాలతో పార్టీ పటిష్టానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమీక్షలో జడ్పీటీసీ సింగ్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్లు మనోజ్‌కుమార్ గౌడ్, గొర్రె దేవేందర్, పల్లెపాటి శాంతిరతన్‌రావు, చిన్నపాక శ్రీనివాస్, ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, ఎంపీటీసీలు మోహన్‌రావు, భూక్యా భాస్కర్, లావణ్యరావు, షబ్బీర్‌అలీ, కిషన్‌నాయక్ పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకుస్థల పరిశీలన
మండల కేంద్రలోని చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్థలాన్ని పరి శీలించారు. విగ్రహ ఏర్పాటుకు అను వైన స్థలం, విధి విధానాలపై స్థానికు ల తో చర్చించారు. కార్యక్రమంలో సర్పం చ్ మాలతీసోమేశ్వర్రావు, ఎంపీటీసీ మాడ్గుల రాజు, అంబేద్కర్ సంఘం నాయకులు డాక్టర్ శ్రీనివాస్, బొట్ల మధు, దేవేందర్ పాల్గొన్నారు.