నర్సంపేట, జనవరి 30: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం అన్నదాతల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నర్సంపేట డివిజన్లోని 58 రైతు కుటుంబాలకు ఆదివారం రూ. 2.90 కోట్ల విలువైన రైతుబీమా చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. దేశానికి అన్నంపెట్టే రైతులు అకాల మరణం పొందితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బతికి ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎంత గౌరవంగా బతికిందో.. యజమాని చనిపోతే కూడా అంతే గౌరవంగా బతుకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారని వివరించారు. పట్టాదారు పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతుకూ బీమా పథకం వర్తిస్తుందన్నారు. రైతుబీమా ప్రీమియాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తున్నదని గుర్తుచేశారు. రైతుబీమా పథకాన్ని యావత్ ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది..
రైతుబీమా, రైతుబంధు పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైనట్లు ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. అలాంటి కేసీఆర్‌ను రైతులందరూ ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేలా ప్రతి పథకాన్ని రూపొందించారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన అందిస్తున్నదని తెలిపారు. 50 ఏళ్లుగా కుంటుపడిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ పరుగులు పెట్టిస్తున్నారని వివరించారు. ఇప్పటి వరకు నర్సంపేట నియోజకవర్గంలో మరణించిన 620 రైతుల కుటుంబాలకు రూ.31 కోట్లు అందించామన్నారు. పేదల కష్టసుఖాల్లో టీఆర్ఎస్ పాలుపంచుకుంటున్నదని చెప్పారు. ఈ సందర్భంగా బీమా సాయం పొందిన రైతు కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సొసైటీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కుమ్మరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. కలవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో అవునూరి రామ్మూర్తి, జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, పాలడుగుల నాగరాజు పాల్గొన్నారు.
రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి
నర్సంపేట రూరల్: గుర్రాలగండిరాజపల్లిలో రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆదివారం పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. గుర్రాలగండిరాజపల్లి నుంచి రంగాపురం పీడబ్ల్యూడీ రోడ్డు వరకూ నూతన రోడ్డు మంజూరు చేయాలని సర్పంచ్ తుత్తూరు కోమల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిశారు. రోడ్డు మంజూరుకు కృషి చేస్తానని పెద్ది హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బండారు శ్రీలత, నర్సంపేట మున్సిపల్ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ, ప్రభుత్వ న్యాయవాది మోటూరి రవి, నాయకులు తుత్తూరు రమేశ్, బండారు రమేశ్, నాగిశెట్టి ప్రసాద్, తుత్తూరు సాంబయ్య, పురాని రవీందర్, కత్తుల కుమారస్వామి, బూస శ్రీశైలం, లింగయ్య, వెంకటేశ్, బాలరాజు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా
దుగ్గొండి: అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని చాపలబండకు చెందిన సర్పంచ్ ఏడెల్లి రజితా ఉమేశ్‌రెడ్డి తండ్రి లింగారెడ్డి, ముద్దునూరు సర్పంచ్ రేవూరి సురేందర్‌రెడ్డి తండ్రి మోహన్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాలను ఎమ్మెల్యే పెద్ది స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన వెంట టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, కాట్ల భద్ర య్య, శానబోయిన రాజ్‌కుమార్, బీరం సంజీవరెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, తోకల నర్సింహారెడ్డి, కంచరకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, పిండి కుమారస్వామి, బానోత్ రవీందర్‌నాయక్, ముత్యాల స్వామి, గుండెకారి రంగారావు, కొంగర రవి, పోతుల అజయ్, రమేశ్ పాల్గొన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం
చెన్నారావుపేట: క్రీడల్లో గెలుపోటములు సహజమని.. గెలిచినా, ఓడినా క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బోజేర్వులోని జగ్గుతండాలో మల్కీశ్రీ పిల్లల దవాఖాన, సంత్‌సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్‌స్థాయి పోటీల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని, ప్రతిభ చూపిన వారిని గుర్తిస్తున్నదని తెలిపారు. మారుమూల ప్రాంతమైన జగ్గుతండాలో డివిజన్‌స్థాయి పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. అనంతరం విజేతలకు ఆయన షీల్డ్‌లు పంపిణీ చేశారు. అలాగే, ఇటీవల పాపయ్యపేట, తిమ్మరాయినిపహాడ్‌లో అనారోగ్యంతో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, బోజేర్వు సర్పంచ్ పిండి విజయాభిక్షపతి, ఎంపీటీసీ మొగిలి రమాకేశవరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, కొండవీటి పావనీప్రదీప్కుమార్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గడ్డల భిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు కంది కృష్ణచైతన్యారెడ్డి, జున్నూతుల శ్రీధర్‌రెడ్డి, గట్ల రాంబాబు, రాసమల్ల సతీశ్, టీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు నాగరాజు, నిర్వాహకులు ఆంగోత్ భద్రయ్య, యూత్ సభ్యులు పాల్గొన్నారు.