నర్సంపేట, జనవరి 30: గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నర్సంపేటలో గాంధీజీ విగ్రహానికి పెద్ది పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ అహర్నిశలు శ్రమించారన్నారు. సత్యం, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని కొనియాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి, యువరాజు, కొంకీస కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
వాడవాడలా గాంధీజీ వర్ధంతి
వరంగల్‌చౌరస్తా/కరీమాబాద్/కాశీబుగ్గ/నర్సంపేటరూరల్/పోచమ్మమైదాన్/గీసుగొండ: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ఆధ్వర్యంలో వరంగల్ 27వ డివిజన్ స్టేషన్‌రోడ్‌లోని గాంధీ విజ్ఞాన కేంద్రం ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రంజిత్, జన్ను భాస్కర్, సందెల లాజర్, బండి సుధాకర్, జంగం ప్రభాకర్, యాకూబ్, కోడం మహేశ్, నర్ర సాగర్, ముజాహిద్, అబ్బాస్ పాల్గొన్నారు. మామునూరులోని 4వ బెటాలియన్ పరేడ్ మైదానంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్ఐలు అలీ, నాగేశ్వర్రావు, కిరణ్‌కుమార్, ఆర్ఎస్సైలు నాగరాజు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. కాశీబుగ్గ ప్రాంతంలోని కాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి ఆలయం ఎదుట ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి దయాకర్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ నాయకులు రాజనాల శ్రీహరి, రత్నం కృష్ణకిశోర్, మార్టిన్ లూథర్, శివ, రాంచందర్, కుమార్ పాల్గొన్నారు. నర్సంపేట మండలం దాసరిపల్లిలో గాంధీజీ విగ్రహం వద్ద సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ పావని, వార్డు సభ్యులు పెరుమాండ్ల అనిల్, పీ చంటి, నాగరాజు, నరేశ్ రెండు నిమిషాలు మౌనం పాటించారు. దుగ్గొండి పోలీసుల ఆధ్వర్యంలో మండలకేంద్రంలో గాంధీజీ వర్ధంతి నిర్వహించారు. మందపల్లి, రంగాపురం ప్రభుత్వ పాఠశాలల్లో గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్‌లు మొగ్గం మహేందర్, కొండం రమాదేవీవిజేందర్రెడ్డి, మందపల్లి, రంగాపురం హెచ్ఎంలు రామ్మూర్తి, కనకయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరంగల్‌లోని 12వ డివిజన్ లక్ష్మీ మెగాటౌన్షిప్లో గాంధీ వర్ధంతి నిర్వహించారు. కార్పొరేటర్ కావటి కవిత మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాసవీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ప్రతినిధి తోట పూర్ణచందర్, పలువురు కాలనీ అభివృద్ధి కమిటీ స భ్యులు పాల్గొన్నారు. గీసుగొండ మండలవ్యాప్తంగా గాంధీ వ ర్ధంతి నిర్వహించారు. వరంగల్ 16వ డివిజన్ ధర్మారం ఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో దూరవిద్య కో ఆర్డినేటర్ శ్రీకాంత్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. స్థానికులు కట్రోజు కన్నయ్య, హరికృష్ణ, శ్రీకాంత్, ఏ రాంచరణ్ పాల్గొన్నారు.