e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిల్లాలు గిరిజనులకు మెరుగైన వైద్యం

గిరిజనులకు మెరుగైన వైద్యం

గిరిజనులకు మెరుగైన వైద్యం

అనాథ పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే
కరోనా నియంత్రణకు చర్యలు కట్టుదిట్టం
ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలి
మంత్రి సత్యవతి రాథోడ్‌
ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష

ఏటూరునాగారం, మే 28 : అడవి బిడ్డలకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తోందని, సీఎం కేసీఆర్‌ కరోనా కట్టడికి చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శా ఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో కరోనా కట్టడి, ధాన్యం కొ నుగోలు, విత్తనాలు, ఎరువుల పంపిణీపై శుక్రవా రం మంత్రి సమీక్ష నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని సామాజిక దవాఖానలోని ఐసొలేషన్‌ వార్డును సందర్శించి కరోనా రోగులతో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, కరోనాతో తల్లిదండ్రులు మృతి చెందితే పిల్లల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందన్నా రు. సీఎం ఆలోచన మేరకు రోగులకు వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గుతున్నాయన్నారు.
అందుబాటులోకి 20 ఆక్సిజన్‌ పడకలు..
కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన 20 ఆక్సిజన్‌ పడకల వార్డు ను మంత్రి ప్రారంభించారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ను వైద్యశాలకు అందించారు. క్రాస్‌ రోడ్డులో కరోనా రోగి ఇంటికి వెళ్లి పరామర్శించి నిత్యావస ర సరుకులు అందించారు. గ్రామాల్లో కరోనా పా జిటివ్‌ కేసుల సంఖ్యపై డీఎంహెచ్‌వో అప్పయ్యను అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫీవర్‌ సర్వే కొనసాగుతున్నదని, సీరియస్‌గా ఉన్న రోగులను వైద్యశాలలో చేర్పించి ఆక్సిజన్‌ అందిస్తున్నట్లు తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలి..
ధాన్యం కొనుగోలు, రవాణాను పర్యవేక్షించాల ని అధికారులను మంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన సేకరణ వివరాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం సమీసి స్తున్నందున రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించాలన్నారు. ధాన్యంలో మిల్లర్లు తరుగు పేరుతో కోత పెడుతున్నారని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కోత లేకుండా చూడాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. ఎంపీ కవిత, జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, అడిషనల్‌ కలెక్టర్‌ ఆదర్శ సురభి, ఐటీడీఏ పీవో హన్మంత్‌ కే జెండగే, డీఎంహెచ్‌వో అప్పయ్య, ఓఎస్‌డీ శోభన్‌కుమార్‌, ఏఎస్పీ గౌస్‌ ఆలం, జిల్లా వ్యవసాయ అధికారి గౌస్‌ హైదర్‌, డీసీఎస్‌వో అరవిందరెడ్డి, జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి అనిల్‌ కుమార్‌, డీసీహెచ్‌ఎస్‌ చందూనాయక్‌, నీటి పారుదల శాఖ ఈఈ జగదీశ్వర్‌, మై నింగ్‌ ఏడీ రఘు, ములుగు, ఏటూరునాగారం ఏ డీఏలు శ్రీపాల్‌, శ్రీధర్‌, గిరిజన సంక్షేమ శాఖ డి ప్యూటీ డైరెక్టర్‌ మంకిడి ఎర్రయ్య, జడ్పీ సీఈవో ప్రసూనరాణి, డీఆర్డీవో నాగ పద్మజ, సామాజిక దవాఖాన సూపరింటెండెంట్‌ సురేశ్‌కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ నిరంజన్‌ రావు, ఏడీఏ లక్ష్మీ ప్రసన్న, వెంకటాపురం జడ్పీటీసీ రమణ, ఏటూరునాగారం జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు వలియాబీ, ఎంపీపీ విజయ పాల్గొన్నారు.
బిల్ట్‌ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ..
మంగపేట మండలం కమలాపురంలోని బిల్టు కార్మికులకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత, జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో హ న్మంత్‌ కే జెండగే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఏఎంఆర్‌ కంపెనీ ఆ ధ్వర్యంలో 200 మందికి ఒక్కొక్కరికి రూ. 2100 విలువైన నిత్యావసర కిట్లు అం దించారు. ఎమ్మెల్యే సీతక్క, తహసీల్దార్‌ ప్రసాద్‌, ఏఎంఆర్‌ చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ వెంకట్‌, సీఎస్‌ఆర్‌ సూపర్‌వైజర్లు అమర్‌నాథ్‌రెడ్డి, బొబ్బిలి నరేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గిరిజనులకు మెరుగైన వైద్యం

ట్రెండింగ్‌

Advertisement