e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జిల్లాలు ధాన్యం తరలించేందుకు సహకరించాలి

ధాన్యం తరలించేందుకు సహకరించాలి

ధాన్యం తరలించేందుకు సహకరించాలి

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

శాయంపేట, మే 18 : మండల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు సహకరించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. కేంద్రాల్లో ధాన్యాన్ని తరలించేందుకు వాహనాల కొరత ఉండడంతో జాతీయ రహదారిపై వెళ్తున్న 25 లారీల వరకు ఆపీ డ్రైవర్లతో మా ట్లాడి.. శాయంపేట మండలంలోని ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. కొనుగో లు కేంద్రాల్లోని ధాన్యాన్ని త్వరగా మిల్లులకు చేర్చేందుకు లారీ ఓనర్లు, డ్రైవర్లు సహకరించాలని కోరారు. డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్రాల వద్ద భోజనంతో పాటు వసతులు కల్పిస్తామన్నారు. కేంద్రాల్లో అధిక మొత్తంలో ధా న్యం నిల్వలు ఉన్నాయని రైతులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. కాంటా పెట్టిన ధాన్యం బస్తాలను తరలించేందుకు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ధాన్యం తరలింపునకు వాహనాలను సమకూర్చేందుకు చర్య లు తీసుకోవాలని సీఐ రమేశ్‌కుమార్‌కు ఎమ్మెల్యే సూచించారు. ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌బాబు, వైస్‌ చైర్మన్‌ దూదిపాల తిరుపతిరెడ్డి, పీ శ్రీనివాస్‌రెడ్డి, రాంశెట్టి లక్ష్మారెడ్డి ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధాన్యం తరలించేందుకు సహకరించాలి

ట్రెండింగ్‌

Advertisement