గిర్మాజీపేట, జూలై 9 : బీరన్నస్వామికి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహించే బోనాల ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు దేవస్థాన కమి టీ సభ్యులు ఆహ్వానం అందించారు. శనివారం శివనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షుడు కోరె కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోరె నాగరాజు, కోశాధికారి నరిగె లక్ష్మణ్, కులపెద్దలు దయ్యాల కృష్ణ, మండల కిరణ్, ఉపాధ్యక్షుడు కడారి కృష్ణ, సహాయ కార్యదర్శి గౌడ రమేశ్, ముఖ్య సలహాదారులు కోరె కుమారస్వామి, కంకల మల్లేశం, బండారి రాజేశ్వర్, ఆర్గనైజర్లు నంద నవీన్, దయ్యాల సాయినాథ్, కుండె క్రాంతికుమార్, కార్యవర్గ సభ్యులు మురికి కుమారస్వామి, కంచ తిరుపతి, వాసూరి శ్రీనివాస్, కంకల శంక ర్, కొమ్ము రాజు, బండారి అరవింద్, మండల జంపయ్య, మురికి రవి పాల్గొన్నారు.
ఆదుకోవాలి..
మూడేళ్లుగా కిరోసిన్ పంపిణీ నిలిపివేయడంతో దానిపై ఆధారపడిన కిరోసిన్ రిటైల్ డీలర్ల కుటుంబాలు జీవనోపాధి లేక రోడ్డున పడ్డారని.. ప్రభుత్వం తరుఫున ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే నన్నపునేనికి క్యాంపు కార్యాలయంలో డీలర్ల సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు యెలబోయిన సాంబయ్య, గౌరవాధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి గూడ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.