మహబూబాబాద్ రూరల్,జూన్ 18 : గ్రామ ప్రజలు తమ పిల్లల పోషణ, చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం మండలంలోని రెడ్యాల గ్రామంలో 5వ విడుత పల్లెప్రగతి ము గింపు సందర్భంగా సర్పంచ్ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో అదనపు కలెక్టర్ అభిలాషాఅభినవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. మొదటగా గ్రామంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీసెంటర్, పల్లె దవాఖానను సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నదన్నారు. గ్రామంలోని పల్లెప్రకృతి వనం, వైకుంఠధామాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నా రు. పల్లె దవాఖానను గ్రామస్తులు వినియోగించుకోవాలని, ప్రైవేట్ వైపు వెళితే ఏఎన్ఎంలే బాధ్యులవుతారని హెచ్చరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రా మం లో డంపింగ్ యార్డు, నర్సరీ, వైకుంఠధామం నిర్మాణానికి తన సొంత భూమిని విరాళంగా ఇచ్చిన సర్పంచ్ వెన్నం శ్రీకాంత్‌రెడ్డిని కలెక్టర్ అభినందించారు. గ్రామ ప్రజల సహకారంతో జీపీని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లలిత, జడ్పీ డిప్యూటీ సీఈవో నర్మద, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో హరిప్రసాద్, సెక్రటరీ శేఖర్, మండల అధికారులు పాల్గొన్నారు.