కృష్ణకాలనీ, జూన్ 18: పేదల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు కృష్ణకాలనీలో ఎమ్మెల్యే గండ్ర ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజే పీ, సీపీఐ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ప్రజాప్రతినిధులను ప్రజలు గుర్తుంచుకొని ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. కృష్ణ, యాదవ, సుభాష్ కాలనీల్లో సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని పట్టాల కోసం గతం లో ప్రజలు ధర్నాలు చేసేవారు. కానీ, తాను గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్తో మాట్లాడి ఎంతో మందికి పట్టాలు ఇప్పించానని, మరికొందరికి త్వరలో పట్టాలిస్తానని హామీ ఇచ్చారు.
కృష్ణకాలనీలో రూ. 41 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. రాబోయే రోజుల్లో మరి న్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చా రు. మంత్రి కేటీఆర్ హయాంలో రాష్ట్రంలోని పట్టణాలన్ని అభివృద్ది పథంలో నడుస్తున్నాయన్నారు. విద్య, వైద్య రంగంలో వెనుకబడి ఉన్న భూపాలపల్లికి ఇంటర్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలతో పాటు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు, కళాశాలు తీసుకొచ్చానన్నారు. 500 పడకల దవాఖానను తీసుకురావడంతో పాటు వచ్చే విద్యాసంవత్సరం నుంచి మెడికల్ కాలేజీ కూడా ప్రారంభంకానున్నదని తెలిపారు. అంతేకాకుండా జిల్లాలో రెండు వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, సింగరేణి కార్మికులకు వెయ్యి క్వార్టర్లు అందజేస్తామన్నారు. అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగులను బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. అగ్నిపథ్ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు.
కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ పటేల్, మహిళా అధ్యక్షురాలు తిరుపతమ్మ, ఆరో వార్డు కౌన్సిలర్ ఎడ్ల మౌనికాశ్రీనివాస్, కౌన్సిలర్లు శిరుప అనిల్, సజ్జనపు స్వామి, మురళీధర్, నాగవెల్లి సరళా లింగమూర్తి, పానుగంటి హారికాశ్రీనివాస్, టీఆర్ఎస్ టౌన్ మాజీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, టీబీజీకేఎస్ బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, టీఆర్ఎస్ ఆరో వార్డు అధ్యక్షుడు మధూకర్రెడ్డి, ఆలయ చైర్మన్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బీబీచారి, కురిమిళ్ల శ్రీనివాస్, కరీం, గండ్ర యువసేన నాయకులు, పార్టీలో చేరిన వారిలో అంబాల నర్సయ్య, బీ సారయ్య పాల్గొన్నారు.