భీమదేవరపల్లి, జూన్ 3 : పల్లెప్రగతితో పల్లెలన్నీ అద్దంగా మారాలని జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్ అన్నారు. శుక్రవారం విశ్వనాథకాలనీలో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 18 వరకు పల్లెప్రగతి కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నా రు. ప్రతి గ్రామంలో అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించాలన్నారు. కాగా, నిత్యం ఉపా ధి పనులకు వెళ్తూ గ్రామపంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్న సర్పంచ్ వల్లెపు అనితను అభినందించారు. ఆమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం ములుకనూరు, ముత్తారం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను జడ్పీ చైర్మన్, కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్, ఎంపీపీ జక్కుల అనితారమేశ్, జడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్‌లు వల్లెపు అనిత, మాడుగుల కొంరయ్య, శాంతికుమార్, ఎంపీడీవో భాస్కర్, ఐసీడీఎస్ సీడీపీవో అనిత, ఎంపీవో నాగరాజు, ఏపీఎం కుమారస్వామి, ఈసీ శ్రీధర్ పాల్గొన్నారు.
పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి
శాయంపేట : ఐదో విడుత పల్లెప్రగతిని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని కాట్రపల్లి, సాధన్పల్లి గ్రామాల్లో ఆమె పర్యటించి, పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం గ్రామసభలో ఆమె మాట్లాడుతూ గ్రామా ల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుపతిరెడ్డి, డీఎల్పీ వో కల్పన, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీ వో రంజిత్‌కుమార్, ఎంపీటీసీ ఆజ్మీర ఉమ పాల్గొన్నారు. అలాగే, శాయంపేట గ్రామసభలో డీఎల్పీవో కల్పన పాల్గొన్నా రు. గ్రామంలో తిరుగుతూ పారిశుధ్య పనులను పరిశీలించారు. సర్పంచ్ రవి, ఉప సర్పంచ్ సుమన్ పాల్గొన్నారు. పెద్దకోడెపాకలో సర్పంచ్ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ప్రత్యేక అధికారి హేమానాయక్, ఎంపీటీసీలు వేణుగోపాల్, మంగమ్మ పాల్గొన్నారు.
అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి
కమలాపూర్ : గ్రామాల అభివృద్ధి కోస మే పల్లెప్రగతి నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ అన్నారు. మండలంలోని శంభునిపల్లిలో పల్లె ప్రగతి ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పం చ్ పెండ్యాల రవీందర్‌రెడ్డి, ఎంపీవో రవి, ఏఈవో సరిత, ఈసీ కార్తిక్, నాయకులు పిడిశెట్టి కుమారస్వామి, తిరుపతిరెడ్డి, దుండ్ర గోపాల్ పాల్గొన్నారు.
పల్లెప్రగతి లక్ష్యాలను చేరుకోవాలి
ఎల్కతుర్తి : పల్లెప్రగతి లక్ష్యాలను చేరుకోడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని అదనపు డీఆర్డీవో రవి అన్నారు. మండలంలోని బావుపేటలో పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్‌ను సర్పంచ్ దాట్ల రాము, ఏపీవో విజయలక్ష్మితో కలిసి పరిశీలించారు. అనంతరం గ్రామసభలోపనులపై తీర్మానం చేశారు. అలాగే, గోపాల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, ఎంపీడీవో తూర్పాటి సునీ త పాల్గొని పల్లెప్రగతి పనులను గుర్తించి, గ్రామసభ నిర్వహించారు.
జయగిరిలో..
హసన్‌పర్తి : మండలంలోని జయగిరిలో సర్పంచ్ బొల్లవేణి రాణి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ సునిల్‌కుమార్ హాజరు కాగా, ప్రజలు పలు సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏలిమి రమేశ్, వార్డు సభ్యులు కొంగంటి రాజు, పోగుల కిరణ్, కార్యదర్శి వెంకన్న పాల్గొన్నారు.
పులుకుర్తిలో..
దామెర : మండలంలోని పలుకుర్తిలో సర్పంచ్ గోవిందు అశోక్ అధ్యక్షతన పల్లెప్రగతి గ్రామసభ నిర్వహించారు. తహసీల్దార్ రియాజొద్దీన్, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, ఎంపీటీసీ గోవిందు సంధ్యాఅశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు, ఉపసర్పంచ్ మెంతుల రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో ప్రజలు భాగస్వాములై గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మసాగర్ మండలంలో..
ధర్మసాగర్ : పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని నారాయణగిరి, ధర్మసాగర్, ధర్మపురం, శాయిపేట, జానకీపురం తదితర గ్రామాల్లో గ్రామస్తులు, ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులు ర్యాలీలు నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్‌లు శరత్, రవీందర్ యాదవ్, రాజు, నవ్య పాల్గొన్నారు.
నడికూడ మండలంలో..
నడికూడ : మండలంలోని నడికూడ, వరికోల్, పులిగిల్ల, చర్లపల్లి తదితర గ్రామా ల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో గ్రామసభలను ఏర్పాటు చేశారు. సభలో 5వ విడుత పల్లెప్రగతి సంబంధించి అనేక అంశాలపై కార్యదర్శి, వార్డు మెంబర్ల్లతో సమీక్షించి, తీర్మా నం చేశారు. ర్యాలీలు నిర్వహించారు. కాగా, ఉత్తమ అవార్డు పొందిన నడికూడ సర్పంచ్ ఊర రవీందర్ రావును సన్మానించారు. నడికూడలో ప్రత్యేక అధికారి బాలకృష్ణ, కార్యదర్శి సందీప్, ఏఈ రాజ్‌కుమార్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ నారగాని ఐలయ్య, ఉప సర్పంచ్ కిన్నెర మణి, పీఏసీఎస్ డైరెక్టర్ ఊర సతీశ్‌రావు, ఏఎన్ఎం రాజ్యలక్ష్మి, పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్, వరికోల్ గ్రామంలో సర్పంచ్ సాధు నిర్మల సమ్మిరెడ్డి, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి పాల్గొన్నారు.
ఐనవోలు మండలంలో..
ఐనవోలు : మండల వ్యాప్తంగా గ్రామా ల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రత్యేకాధికారి నాగేశ్వర్రావు పర్యటించి సమస్యలు గుర్తించారు. గ్రామ ప్రత్యేకాధికారి కుమారస్వామి, సర్పంచ్ కుమారస్వామి, కార్యదర్శి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.