సంగెం, మే 29 : టీడీపీ సంగెం మండలాధ్యక్షుడు, కాట్రపల్లి మాజీ ఎంపీటీసీ సౌరం సంపత్ ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హనుమకొండలోని తన నివాసంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్లు తెలిపాడు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి నాయకుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు.
టీఆర్ఎస్ సర్కారు సంక్షేమ ప్రభుత్వం..
పరకాల : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని, కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన పలువురు హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి చల్లా టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. అన్ని మతాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. దీంతో ప్రతిపక్ష నాయకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ పాలనకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలు కనుమరుగవుతాయన్నారు. మారబోయిన నరేశ్, ఆలేటి రాజేశ్, ఆలేటి తిరుపతి, బొజ్జం కృష్ణంరాజు, బొజ్జం సంతోష్, బొజ్జం రాజు, బొజ్జం పూర్ణచందర్, మంద ప్రమోద్, మంద శ్రీనివాస్‌తో పాటు అరవై మంది యువకులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు నేతాని శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.