మంగపేట మే13: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం గరుడాధి వాసం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భం గా యాగశాలలో గరుడ పఠ లేఖనం వేశారు. అనంతరం మేళ వాయిద్యాల నడుమ అర్చక బృందం దైత అమ్మవారి వద్దకు వెళ్లి అభిషేకాలు, పూజలు, స్నపనం తదితర క్రతువులను నిర్వహిం చారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
సాయంత్రం దేవస్థాన ప్రాంగణంలో గరుడ పఠాన్ని ఆవిష్క రించి గరుడాధివాసం(గరుడుకి ప్రాణం పోసి పఠంలోకి ఆహ్వానించే ప్రక్రియ)ను అత్యంత నియమ నిష్టల నడుమ జరిపారు. హేమాచలుడి కల్యాణానికి ముక్కోటి దేవతలను ఆహ్వానం పలి కేందుకునేడు(శనివారం) ధ్వజారోహణ (గరుడ పఠాన్ని ధ్వజ స్తంభం పైకి ఆవిష్కరించే తంతు) నిర్వ హించనున్నట్లు దేవస్థాన అర్చకులు పేర్కొ న్నారు. ఈ వేడుకల్లో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ, భద్రాచలం ఆలయ అర్చకులు మురళీ కృష్ణమాచార్యుల బృందం, మ ల్లూరు ఆలయ ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘ వాచార్యులు, రాజశేఖరశర్మ, పవన్‌కుమార్ ఆచా ర్యులు, ఈశ్వర్‌చందు శర్మ, సీతారాములు, శేషు, ఇతర సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.