హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 26: రాష్ట్రంలో ఉద్యోగాల జాతర షురువైంది. ఇప్పటికే పోలీసు కొలువులకు ప్రకటన వెలువడగా, మంగళవారం 503 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్-1 నోటిఫి కేషన్ విడుదల చేసింది. తెలంగాణ ఏర్పడిన త ర్వాత తొలిసారిగా గ్రూప్-1 భారీ నోటిఫికేషన్ వె లువడింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా అ భ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ సారి ప్ర భుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మే 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 31న చివరి తేదీగా ప్రకటించారు. ఈ పోస్టులకు కనీస అర్హత డిగ్రీ, ప్రిలిమ్స్ జూలై లేదా ఆగస్టులో నిర్వహించనున్నారు. మళ్లీ నిరుద్యోగుల్లో ఆశల దీపం చిగురించింది. ఇప్పటికే కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. నోటిఫికేషన్ల కోసం ఎదు రుచూస్తున్న నిరుద్యోగ యువతీయువకుల్లో సంద డి మొదలైంది. ఇప్పుడు తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఉ త్సాహాన్ని నింపాయి. తెలంగాణ ప్రభుత్వం ఇం టర్వ్యూలను రద్దు చేయడం.. కొత్త జోనల్ వ్యవస్థ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా కమి షన్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
503 పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణలో మొదటి విడుతలో దాదాపు 30 వేలకుపైగా ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధ మవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పో స్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు ఎంపిక ప్రక్రియ నిర్వ హించనుంది. 83,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించిన నేప థ్యంలో ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు వెలువడుతు న్నాయి. అయితే చాలా ఏళ్ల తర్వాత గ్రూప్-1 నో టిఫికేషన్ విడుదల అవుతుండడంతో భారీగా అ భ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.. వయోపరిమితి కూడా సడలించడంతో లక్షల్లో అ భ్యర్థులు పోటీపడే అవకాశం ఉంది. దీంతో జాబ్స్ సాధించేందుకు కఠోరంగా సాధన చేస్తున్నారు.
ఎంపిక విధానం..
గ్రూప్-1 సర్వీసులకు ఎంపిక ప్రక్రియ రెండు దశలుగా ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్. గ్రూ ప్-1 అభ్యర్థులకు ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందిన వారికి రెండో దశలో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత తుది జాబితా విడుదల చేసి నియామ కాలు ఖరారు చేస్తారు.
గ్రూప్స్ సాధించడమే లక్ష్యం..
మాది ఓబులాపురం.. ప్రాథమిక విద్య నుంచి ఘన్‌పూర్‌లో డిగ్రీ పూర్తి చేసుకుని గ్రూప్స్ లక్ష్యంగా ఆరు నెలల నుంచే పూర్తిస్థాయిలో శిక్షణ పొందుతు న్నా. నిష్ణాతులైన అధ్యాపకుల బృందంచే గైడెన్స్ తీసుకుని పూర్తిస్థాయిలో ప్రిపేర్ అవుతున్నా.. ఎప్పు డెప్పుడా అని ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ ఒకటి తర్వాత ఒకటి ఇస్తున్నారు. గ్రూప్-1, పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారికి మంచి అవకాశం.
– బానోత్ వెంకన్న, గ్రూప్-1 అభ్యర్థి
కఠోర సాధన చేయాలి..
రాష్ట్రంలో ఒకటి తర్వాత జాబ్స్‌కు నోటిఫి కేషన్ విడుదల చేస్తున్నారు. కానిస్టేబుల్స్, ఎస్సై ఉద్యోగాల తోపాటు జాబ్స్, గ్రూప్-1 నోటిఫికేషన్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పరీక్షలో నేను తప్పకుండా విజయం సాధిస్తా. గ్రూప్-1కు కఠోర సాధన చేయాలి. ఎలాగైనా నేను జాబ్ కొడతానని గట్టి నమ్మకం ఉంది. అందుకోసం గట్టి ప్రయత్నమే చేస్తా.
– పీ సౌమ్య, రేగొండ