పరకాల, ఏప్రిల్ 15 : ఉద్యోగ సాధనలో లక్ష్యంతో ముందుకు సాగాలని ఏసీపీ శివరామయ్య సూచించారు. పరకాల, నడికూడ మండలాలకు చెందిన 79మంది నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్‌ను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇటీవల పరకాల సబ్‌డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కోచింగ్‌లో మెరిట్ సాధించిన వారికి స్టడీ మెటీరియల్‌ను అందించినట్లు తెలిపారు. వారు ఉద్యోగ సాధనే లక్ష్యంగా నిరంతరం కష్టపడి చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ పుల్యాల కిషన్, ఎస్సైలు ప్రశాంత్ బాబు, శివకృష్ణ, సిబ్బంది మహిపాల్‌రెడ్డి, దేవేందర్, రాజ్‌కుమార్, జనార్దన్, నరేందర్, రాజేందర్ పాల్గొన్నారు.
గట్లకానిపర్తిలో కార్డెన్‌సెర్చ్
శాయంపేట : మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పరకాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర మండలాల పోలీసులు గ్రామంలో తనిఖీలు నిర్వహించి, ఇరవై లీటర్ల గుడుంబా, బెల్ట్‌షాపులపై దాడులు చేసి రూ.5300 విలువైన మద్యంను పట్టుకున్నారు. వాటిని విక్రయిస్తున్న రాయరాకుల వెంకటయ్య, మహ్మద్ రబీయా, బండారి పాపయ్య, కుసుమ సరేశ్పై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా పరకాల ఏసీపీ శివరామయ్య మాట్లాడుతూ ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, దొంగతనాలు, హెల్మెట్ వాడకం, డయల్ 100, షీ టీమ్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస్‌రావు, కిషన్, గణేశ్, ఎస్సైలు వీరభద్రారావు, హరిప్రియ, శివకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.