వరంగల్, ఏప్రిల్ 13(నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు జిల్లాలో రైతుల నుంచి యా సంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కోసం ప్రణాళిక రూ పొందించారు. అవసరమైన గన్నీ సంచులను సమకూర్చుకోవడంపైనా దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయనుందని సీఎం కేసీఆర్ మంగళవారం ప్రకటించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు వ్యవసాయశాఖ నుం చి గత సంవత్సరం యాసంగి, ప్రస్తుత యాసంగిలో రైతులు సాగు చేసిన వరి విస్తీర్ణం వివరాలను సేకరించారు. గత ఏడాది 97,058 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 78,244 ఎకరాలకు తగ్గినట్లు గుర్తించారు. సాగు విస్తీర్ణంలో రాయపర్తి మండలం టాప్లో ఉంటే పర్వతగిరి, వర్ధన్నపేట మండలాలు రెండో, మూడో స్థానంలో ఉన్నాయి. చెన్నారావుపేటలో 4,602, దుగ్గొండిలో 1,290, ఖానాపురంలో 2,644, నల్లబెల్లిలో 3,860, నర్సంపేటలో 4,736, నెక్కొండలో 7,724, గీసుగొండలో 2,216, ఖిలావరంగల్లో 3,204, పర్వతగిరిలో 13,316, రాయపర్తిలో 17,604, సంగెంలో 5,629, వరంగల్లో 151, వర్ధన్నపేటలో 11,268 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు.
జిల్లాలో రైతులు సాగు చేసిన 78,244 ఎకరాల వరి పంట నుంచి 1,86,707 టన్నుల దిగుబడి వ స్తుందని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది 97,058 ఎకరాల వరి పంట నుంచి 2,63,139 ట న్నుల ధాన్యం వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. 205కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ప్రభు త్వ మద్దతు ధరతో రూ.524.26 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. గత వానకాలం 186 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.383.91 కోట్ల విలువైన 1,97,073 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. ప్రస్తుత యాసంగి ధాన్యం కొనుగోలుకు 46,67,675 గన్నీ సంచులు అవసరమని నివేదికలో తెలిపారు. జిల్లాలో ధాన్యం మిల్లింగ్ చేసేందుకు రైస్ మిల్లులు 114 ఉన్నాయని, వీటిలో 93 రా, 21 బా యిల్డ్ రైస్ మిల్లులని నివేదించారు. ఈసారి 1,86,707 టన్నుల ధాన్యం కొనుగోలు కోసం గ్రామా ల్లో ఏర్పాటు చేయాల్సిన కేంద్రాల ఏర్పాటుపై అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో కొనుగోలు కేంద్రాల సంఖ్యపై స్పష్టత రానుంది. ఈ యాసంగిలో ముందుగా రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం మండలాల్లో వరి పంట చేతికి రానుంది. ఈ మండలాల రైతులు వరి పంట కో సేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మొదట ఈ మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.