నయీంనగర్, ఏప్రిల్ 9 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ ఒకటో డివిజన్ ముచ్చర్ల గ్రామా నికి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్త లు శనివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సంద ర్భంగా హంటర్‌రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అరూరి రమేశ్ మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, టీఆర్ఎస్ ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, గ్రామ అధ్యక్షుడు సూరం ప్రమోద్‌కుమార్ యాదవ్, మార్కెట్ డైరెక్టర్ గనిపాక విజయ్, నాయకులు సోమయ్యగౌడ్, మట్టెడ రాజేశ్, మట్టెడ సుమన్, శ్రావణ్, వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రమోద్ పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి ప్రాధాన్యం
న్యూశాయంపేట : అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖిలా వరంగల్ మండలానికి చెందిన 38 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఈదురి అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణను వినియోగించుకోవాలి
కరీమాబాద్ : ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మామునూరులోని పీటీసీలో ఏర్పాటు చేయనున్న ఉచిత శిక్షణ సెంటర్‌ను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 90రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులకు వర్ధన్నపేటతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువత వస్తారన్నారు. వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు.