ENG vs SCO : టీ20 ప్రపంచకప్‌లో ఇంగండ్ మళ్లీ పుంజుకుంది. వెస్టిండీస్ చేతిలో కంగుతిన్న బ్రూక్ సేన.. ఉత్కంఠ పోరులో స్కాట్లాండ్పై విజయంతో సూపర్ 8 రేసులోకి దూసుకొచ్చింది. హిట్టర్లతో నిండిన ఇంగ్లండ్‌ను స్కాట్లాండ్ బౌలర్లు బెంబేలెత్తించి సవాల్ విసిరారు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా టామ్ బ్యాంటన్(63 నాటౌట్) సమయోచితంగా ఆడాడు. 19వ ఓవర్లో విల్ జాక్స్ (16 నాటౌట్) 4, 6 బాదడంతో 5 వికెట్ల తేడాతో గెలిచింది. లీగ్ దశలో రెండో విజయంతో సూపర్ 8 అవకాశాల్ని మెరుగు పరుచుకుంది.
పదో సీజన్ పొట్టి ప్రంచకప్లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయం ఓ సంచలనం. శనివారం స్కాట్లాండ్ సైతం రెండుసార్లు ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చేలా కనిపించింది. కానీ, టామ్ బ్యాంటన్(63 నాటౌట్) ఒంటరి సైనికుడులా పోరాడి జట్టుకు ఓటమిని తప్పించాడు. 153 పరుగుల ఛేదనలో తొలి ఓవర్లోనే మెక్‌ముల్లెన్ (1-23) డేంజరస్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(2)ను ఔట్ చేసి ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. రెండో ఓవర్లో జోస్ బట్లర్(3) సైతం డగౌట్ చేరగా.. బ్యాంటన్, జాకబ్ బెథెల్(32) మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
England get back to winning ways with victory against neighbours Scotland in Kolkata!
Scorecard: https://t.co/ZPBMbdLYce pic.twitter.com/X5wc3Mz6nZ
— ESPNcricinfo (@ESPNcricinfo) February 14, 2026
ఇంగ్లండ్‌ను గెలుపు దిశగా నడిపిస్తున్న ఈ ద్వయాన్ని డేవిడ్సన్ విడదీశాడు. బెథెల్ ఔటయ్యాక.. హ్యారీ బ్రూక్(4), సామ్ కరన్(28) సాయంతో బ్యాంటన్ పోరాడి స్కాట్లాండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. 17 బంతుల్లో 15 పరుగులు అవసరమైన దశలో విల్ జాక్స్(16 నాటౌట్) ధనాధన్ ఓడించడం గ్లండ్ ఓటమిని తప్పించుకుంది. అంతకుముందు ఆదిల్ రషీద్(3-36) స్పిన్ ధాటికి స్కాట్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మైఖేల్ జోన్స్(33), రిచీ బెరింగ్టన్(49)ల మెరుపులతో ఆ జట్టు152 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2-24), లియాం డాసన్(2-34)లు రెండేసీ వికెట్లతో రాణించారు.