తుంగతుర్తి, ఫిబ్రవరి 14 : తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన అఖిలేశ్ యాదవ్ తెలంగాణ 69వ ఎస్జీఎఫ్ అండర్-17 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నెల 13 నుండి 16వ తేదీ వరకు జరగనున్న స్పోర్ట్స్ మీట్‌కు తెలంగాణ జట్టుకు అఖిలేశ్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు ఎస్జీఎఫ్ సెక్రెటరీ కిరణ్ కుమార్ తెలిపారు. అఖిలేశ్ ఎంపిక పట్ల కోచ్ ఉస్మాద్, తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.