ఐనవోలు, జనవరి 27 : తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ మార్నేని మధుమతి దంపతులు బుధవారం రాత్రి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ నెల 10న తమ కుమార్తె మార్నేని రిషిత -జోగినిపెల్లి ప్రతీక్‌రావు వివాహం హనుమకొండ చింతగట్టు క్యాంప్ దగ్గర బీజీఆర్ గార్డెన్స్‌లో జరుగనున్నట్లు తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి పెళ్లి పత్రిక, ఐనవోలు మల్లికార్జునస్వామి ఫొటోను అందజేశారు.