నర్సంపేటరూరల్, జనవరి 27: గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని ఎంపీపీ మోతె కళావతి అన్నారు. మండలంలోని రామవరం జీపీ పరిధిలోని రంగంపల్లి ఒకటో వార్డులో సీసీరోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ ప్రారంభించి మాట్లాడారు. రంగంపల్లిలో సీసీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో రూ. 5 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. మారుమూల పల్లె నుంచి పట్టణం వరకూ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన అందిస్తున్నదని కొనియాడారు. మండలంలోని 27 గ్రామాల్లో విడుతల వారీగా సీసీరోడ్లు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో రామవరం, లక్నేపల్లి సర్పంచ్‌లు కొడారి రవన్న, గొడిశాల రాంబాబు, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, ఉప సర్పంచ్‌లు జినుకల విమల, పరాచికపు సంతోష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా వీరన్న, మాజీ ఎంపీటీసీ శ్యాంసుందర్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నర్సయ్యగౌడ్, వార్డు సభ్యుడు కిషన్, మండల నాయకులు ఓంప్రకాశ్, మోతె పద్మనాభరెడ్డి, భిక్షపతి, భాస్కర్, విజేందర్, కొమ్మాలు, సమ్మయ్య పాల్గొన్నారు.
సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
చెన్నారావుపేట/వర్ధన్నపేట: చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్‌లో రూ. 5 లక్షల నిధులతో జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతితో కలిసి సీసీరోడ్డు పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సిద్ధెన రమేశ్, జాటోత్ స్వామినాయక్, ఎంపీటీసీ కడారి సునీతాసాయిలు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నార్లాపురం ఐలయ్య, ధరావత్ రాములు, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ అమ్మ రాజేశ్, బుర్రి మోహన్, తిరుపతి, అమ్మ రవి, నాంపెల్లి రాజు, మరాఠి రవి, ధర్మయ్య, నర్సయ్య, రాజు, కొమురయ్య, శంకర్ పాల్గొన్నారు. వర్ధన్నపేట మండలంలోని ఇల్లందలో సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గ్రామాల వారీగా మంజూరు చేసిన నిధులతో ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచనల మేరకు సీసీరోడ్లు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఇల్లందలో రూ. 5 లక్షలతో సీసీరోడ్డు పనులను ప్రారంభించినట్లు సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.