వరంగల్, మార్చి 10(నమస్తేతెలంగాణ) : జిల్లాలో దళితబంధు తొలి విడుత లబ్ధిదారులకు యూనిట్లు అందజేసేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నా యి. జిల్లాలో ఐదు శాసనసభ నియోజకవర్గాల పరిధి ఉంది. వీటిలో నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాలు పూర్తిగా వర్ధన్నపేట నియోజకవర్గంలోని రెం డు మండలాలు, ఒక మున్సిపాలిటీ, మూడు జీడబ్ల్యూఎంసీ డివిజన్లు, పరకాల నియోజకవర్గంలోని రెండు మండలాలు, మూడు జీడబ్ల్యూఎంసీ డివిజన్లు, పాలకుర్తి నియోజకవర్గంలోని ఒక మండలం ఉన్నాయి. నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుంచి తొలివిడుతలో వంద మంది చొప్పున లబ్ధిదారులకు యూనిట్లు అందనున్నాయి. కొంత పరిధి మాత్రమే ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా లబ్ధిదారుల ఎంపిక జరుగడంతో తొలివిడుత యూనిట్లను పొందే వారి సంఖ్య 303 మందిగా తేలింది. వీరిలో ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున రూ.30.30 కోట్ల విలువైన యూనిట్లను అందజేయనుంది.
దళితబంధు పథకం తొలివిడుత అమలుకు నర్సంపేట నియోజకవర్గంలోని 100 మంది పేర్లతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అందజేసిన లబ్ధిదారుల జాబితాకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామం నుంచి 13, దుగ్గొండి మండలంలోని రేఖంపల్లి నుంచి 12, ఖానాపురం మండలం బుధరావుపేట నుంచి 12, నల్లబెల్లి మం డలం రామతీర్థం నుంచి 12, నర్సంపేట మండలం గురిజాల నుంచి 14, నర్సంపేట మున్సిపాలిటీ నుంచి 24, నెక్కొండ మండలం తోపనపల్లి నుంచి 13 మంది ఉన్నారు. గీసుగొండ మండల కేంద్రం నుంచి 15, సంగెం నుంచి 15 మంది పేర్లతో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందజేసిన 30 మంది లబ్ధిదారుల జాబితాకు ఆమోదం తెలిపింది. రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలోని 20 మంది పేర్లతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇచ్చిన జాబితాకు ప్రభుత్వ ఆమోదముద్ర పడింది. వర్ధన్నపేట మండలం అంబేద్కర్‌నగర్ నుంచి 10, పర్వతగిరి మండలం అనంతా రం నుంచి 10, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 14, ఖిలావరంగల్ మండలం మామునూరు నుంచి 9, వరంగల్ మండలం కొత్తపేట నుంచి 10 మంది పే ర్లతో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ 53 మందితో అందజేసిన జాబితాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డివిజన్ వారీగా వరంగల్ మండలం నుంచి 58, ఖిలావరంగల్ మండలం నుంచి 42 మంది పేర్లతో 100 మంది లబ్ధిదారుల జాబితా అందజేశారు.
ఎంపికైన లబ్ధిదారులకు దళితబంధు పథకం అమలుపై నియోజకవర్గం వారీగా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారుల పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న బ్యాంకర్లను కూడా ఆహ్వానిస్తున్నారు. కలెక్టర్ బీ గోపి, అదనపు కలెక్టర్ హరిసింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్‌తో పాటు ఈ పథకం ప్రత్యేకాధికారులు ఎస్కే జహీరుద్దీన్, నర్సింహమూర్తి, సంజీవరెడ్డి, బాలకృష్ణ, నరేశ్‌కుమార్ నాయు డు తదితరులు పాల్గొంటున్నారు. పథకం అమలు, బ్యాంకు ఖాతాలను తెరవడం, యూనిట్లను ఎంపిక చే సుకోవడంపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. కిష్టాపురం లబ్ధిదారులకు రాయపర్తి, సంగెం, గీసుగొం డ మండల కేంద్రాల వారికి సంగెం మండల కేంద్రం లో, నర్సంపేట నియోజకవర్గంలోని లబ్ధిదారులకు నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొద్దిరోజుల క్రితం అవగాహన కార్యక్రమాలు జరిపా రు. నర్సంపేటలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది పాల్గొన్నారు. వర్దన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన 53 మంది లబ్ధిదారులకు గురువారం కలెక్టర్ కార్యాలయం లో అవగాహన కార్యక్రమం జరిగింది.
పథకం అమలు, పర్యవేక్షణ కోసం కలెక్టర్ గోపి ఏర్పాటు చేసిన ఐదు గ్రౌండింగ్ కమిటీల్లో అగ్రికల్చర్ అండ్ అనుబంధ రంగం, ట్రాన్స్‌పోర్టు సెక్టార్, తయారీ యూనిట్స్, రిటేల్ అండ్ షాప్స్, సర్వీసెస్ ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ అనుబంధ రంగం కమిటీ చైర్మన్‌గా డీఏవో, సభ్యులుగా డీవీఏహెచ్‌వో, ఉద్యాన శాఖ డీడీ, ఆత్మ పీడీ, మత్స్యశాఖ డీడీ, జిల్లా మార్క్‌ఫెడ్ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఎంపీడీవో, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఎల్డీఎం సభ్యులుగా నియమితులయ్యారు. ట్రాన్స్‌పోర్టు సెక్టార్ చైర్మన్‌గా జిల్లా రవాణా అధికారి, సభ్యులుగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఎంపీడీవో, సంబంధిత మున్సిపల్ కమిషనర్, ఆర్టీసీ ఆర్ ఎం, ఎల్డీఎం సభ్యులుగా నియమితులయ్యారు. త యారీ యూనిట్ల కమిటీ చైర్మన్‌గా పరిశ్రమల జనరల్ మేనేజర్, సభ్యులుగా తూనికలు కొలతల శాఖ అధికా రి, గనుల శాఖ ఏడీ, డీసీఎస్వో, జిల్లా కార్మిక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఎంపీడీవో, సంబంధిత మున్సిపల్ కమిషనరు నియమితులయ్యారు. రిటేల్ అండ్ షాప్స్ కమిటీ చైర్మన్‌గా మెప్మా పీడీ, సభ్యులుగా మార్కెటింగ్ ఏడీ, డ్రగ్ ఇన్స్పెక్టర్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ, జిల్లా ఆడిట్ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఎంపీడీవో, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఎల్డీఎం నియమితులయ్యారు. సర్వీస్ కమిటీ చైర్మన్‌గా డీఆర్డీఏ పీడీ, సభ్యులుగా డీఎంసీఎస్, ఎంపీడీవో, సంబంధిత మున్సిపల్ కమిషనరు, ఎల్డీఎం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి, డీవైఎస్వో నియమిస్తూ కొద్దిరోజుల క్రితం కలెక్ట ర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి కమిటీలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సభ్యుడిగా, కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.