కాశీబుగ్గ/పోచమ్మమైదాన్/కరీమాబాద్/ ఖిలావరంగల్, ఫిబ్రవరి 26 : దళితుల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతు న్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం 18వ డివిజన్లోని సీబీసీ కంపౌండ్‌లో 18, 19, 20, 21వ డివిజన్లు, దేశాయిపేటలోని సీఎస్ఐ చర్చి వద్ద 12,13,22,23 డివిజన్లు, 32, 39, 40 డివిజన్ల ప్రజలకు జన్మభూమి జంక్షన్‌లోని అన్నపూర్ణ కల్యాణ మండపంలో, శివనగర్ సాయి కన్వెన్షన్ హాలులో 33, 34, 35, 36 డివిజన్లకు చెందిన ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 ఏండ్లలో రాష్ట్రంలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారన్నారు. సీఎం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతి ప్రజాప్రతినిధి ప్రత్యేక శ్రద్ధతో దళితులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని సూచించారు. దళితబంధును విడుతల వారీగా అర్హులందరికీ అందజేస్తామన్నారు. సీబీసీ, చిన్నవడ్డేపల్లి చెరువు కట్టను అభివృద్ధి చేస్తానన్నారు. వరంగల్ తూర్పులో కలెక్టరేట్ వస్తుండడంతో భూముల విలువలు పెరిగాయన్నారు. తొందర్లోనే గుడిసెవాసులకు ఇండ్ల పట్టాలు ఇస్తామని, ఇంటి నిర్మాణం కోసం రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానాషమీమ్ మసూద్, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, వస్కుల బాబు, ఎండీ ఫుర్కాన్, సురేశ్ కుమార్ జోషి, కావటి కవిత, దిడ్డి కుమారస్వామి, సిద్ధం రాజు, మరుపల్ల రవి, సోమిశెట్టి ప్రవీణ్, ముష్కమల్ల అరుణ, పోశాల పద్మ, వేల్పుగొండ సువర్ణ, మాజీ కార్పొరేటర్లు కేడల పద్మ, దామోదర్, నాయకులు కర్నె రవీందర్, పోశాల స్వామి, కర్ర కుమార్, ఈదుల రమేశ్, ఈదుల భిక్షపతి, కలకోట రమేశ్, ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, నాయకులు మైదం నరేశ్, వేల్పుగొండ యాకయ్య, ఎండీ చాంద్‌పాషా, మధు, బొజ్జ రాజ్‌కుమార్, పల్లం పద్మ, మావురపు విజయభాస్కర్‌రెడ్డి, వరంగల్ తహసీల్దార్ సత్యపాల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఓని భాస్కర్, కుందారపు రాజేందర్ పాల్గొన్నారు.
కరీమాబాద్ : మహా శివరాత్రిని పురస్కరించుకుని కరీమాబాద్‌లోని బొమ్మలగుడిలో నిర్వహించనున్న శివ కల్యాణంతో పాటు మహా శివరాత్రి మహోత్సవాలకు సహకరిస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం పెరుకవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో కుడా సలహామండలి సభ్యుడు మోడెం ప్రవీణ్, కొమ్మిని రాజేందర్, వెలిదె శివమూర్తి, నాగపురి సంజయ్‌బాబు, మేడిది మధుసూదన్, వొగిలిశెట్టి అనిల్, పొగాకు సందీప్, బత్తిని రంజిత్, టైలర్ రమేశ్, నాగపురి అశోక్, పౌడాల సంపత్, ఎరబాక సతీశ్, వంగరి సురేశ్, సుంకరి సంజీవ్, వొగిలిశెట్టి సంజీవ్, వంశీ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.