ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 21: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిజామాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఏర్పాటైన ఈ ప్రదర్శనకు తొలి రోజు అనూహ్య స్పందన లభించింది. కార్లు, బైక్‌లకు సంబంధించిన దిగ్గజ కంపెనీలను ఒకే వేదికపై అందుబాటులోకి రావడంతో వాహన ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తమకు నచ్చిన వాహనాలను చూసి, టెస్ట్ డ్రైవ్ చేసి మురిసి పోయారు. కొందరు సందర్శకులు తమకు ఇష్టమైన వాహనాలను కొనుగోలు చేసి తీసుకెళ్లగా, ఇంకొందరు స్పాట్ బుకింగ్ చేసుకున్నారు. భారీగా తరలివచ్చిన సందర్శకులతో స్టాళ్లు కిట కిటలాడాయి.
ఆటో షో అద్భుతం..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో అన్ని రకాల వాహనాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆటో షో నిర్వహించడం అద్భుతమని నిజామాబాద్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కిరణ్‌కుమార్ అన్నారు. రెండ్రోజుల పాటు కొనసాగనున్న వాహన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఒకే వేదికపై అన్ని రకాల కార్లు, బైకులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కొనుగోలుదారుడు తనకు నచ్చిన వాహనాన్ని ఎంచుకునే అవకాశం ఏర్పడిందన్నారు. వాహన దారులు తప్పనిసరిగా సీట్ బెల్ట్/ హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు.

ఆకట్టుకున్న వాహనాలు..
ఆటో షోలో కొలువుదీరిన అధునాత వాహనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రధానంగా ఎలక్టికల్ కార్లు, బైకులు మనసు దోచుకున్నాయి. రూ.10 లక్షల నుంచి రూ.80 లక్షల విలువైన కార్లు ప్రదర్శనలో కొలువు దీరడంతో కొనుగోలుదారులు వాటి గురించి ఆసక్తిగా వాకబు చేశారు. ఆయా కంపెనీల ప్రతినిధులు సందర్శకులకు అత్యాధునిక ఫీచర్స్ గురించి వివరిస్తూ స్పాట్ బుకింగ్ చేసుకున్నారు. ఆటో షోలో మెయిన్ స్పాన్సర్ కియా సన్‌రైజ్‌తో పాటు టాటామోటర్స్ (శ్రీవెంకటేశ్వర మోటార్స్), నెక్సా(మారుతీ సుజుకి), హర్ష టాయోటా, గ్రీన్ హోండా, నిస్సాన్ (లక్ష్మి నిస్సాన్), వరుణ్ మోటార్స్ ( మారుతీ సుజుకి) ఆటోమోటివ్ మహేంద్ర , వెంకటేశ్వర హీరో, లక్ష్మి టీవీఎస్, దేవి ఆటోమొబైల్స్ రాయల్ ఎన్ఫీల్డ్, విజయ గణపతి చేతక్, హోండా (శ్రీరామ్ హోండ) కంపెనీలు తమ వాహనానలు ప్రదర్శనలో ఉంచాయి. కియా జనరల్ మేనేజర్ సతీశ్, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ ధర్మరాజు. బ్యూరో చీఫ్ రమేశ్‌రావు, ఏడీవీటీ ఇన్చార్జి శ్రీకాంత్, వివిధ కంపెనీల సిబ్బంది పాల్గొన్నారు.
చేతక్ కావాలని అడుగుతున్నరు..
ప్రతి ఒక్కరూ చేతక్ కావాలనిఅంటున్నారు. వందల మంది టెస్ట్ డ్రైవ్ చేశారు. రూ. లక్షా16వేల నుంచి రూ. లక్షా.55 వేల వరకు సామాన్యడికి అందుబాటులో ఉన్నాయి. మంచి స్టయిల్లో వెరైటీ కలర్స్ ఉన్నాయి. మూడేండ్ల వారంటీ ఉంటుంది.
-ఆశీష్, మేనేజర్, చేతక్, విజయ్ గణపతి ఆటో మోబైల్స్
వినియోగదారులకు ఉపయోగం
ఆటో షోకు సాయత్రం వేళ చాలా మంది సందర్శకులు వచ్చారు.
ముఖ్యఅతిథి కారుని డ్రైవ్ చేస్తూ చాలా బాగుందని అన్నారు.
రూ.9లక్షల నుంచి 19లక్షల వరకు సరికొత్త మాడల్స్‌లో కార్లు అందుబాటులో ఉన్నాయి.
-అభిషేక్, సేల్స్ మేనేజర్, గ్రీన్ హోండా

Atuo Show
అందుబాటులో హర్ష టాయోటా
సామాన్యులకు అందుబాటులో హర్ష టాయోటా కార్లు ఉన్నాయి. నూ తన వేరియంట్లు అ తి తక్కువ ధరకు ఉన్నాయి. షో రూంలో కార్ల ధరలు రూ. 6.46 లక్షల నుంచి రూ.47.46 లక్షల వరకు ఉన్నాయి.
-హరీశ్, టీం లీడర్
అద్భుతమైన ప్రదర్శన
ఆటోషోలో నిస్సానికి చాలా స్పందన ఉంది. కార్ల ధరలు రూ. 6.93 లక్షల నుంచి రూ. 10.9లక్షల వరకు ఉన్నాయి. సరికొత్త మాడల్స్ అందుబాటులోఉన్నాయి.
-అశోక్, అసిస్టెంట్ మేనేజర్, లక్ష్మి నిస్సాన్
ఆటో షోకు విశేష స్పందన
ఆటో షో చాలా బాగుంది. సన్‌రైజ్ కియా మార్కెట్లో చాలా తక్కువ ధరలకే కార్లు అమ్మకానికి ఉన్నాయి. అందులో నంబర్ వన్ స్థానంలో కీయా ఉన్నది.ప్రారంభం ధర రూ. 7లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
-సతీశ్, మేనేజింగ్ డైరెక్టర్, సన్‌రైజ్ కియా
ఇ-విటారా అద్భుతం
ఎస్యూవీ ఇ -విటారా వాహనం అద్భుతం. డెల్టా, జీటా, అల్ఫా వేరియంట్లలో 49 కిలో వాట్స్, 61 కిలో వాట్స్ బ్యాటరీ ఎంపికతో వస్తుంది. ధర రూ. 15లక్షల నుంచి రూ. 19 లక్షల వరకు ఉంది. అన్ని మోడళ్లు అందుబాటులో ధరలో ఉన్నాయి.
-జగదీశ్, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, నిక్సా (మారుతీ సుజుకీ)
విక్టరిస్ వాహనం బాగుంది..
విక్టరీస్ అద్భుతంగా ఉంది. అన్ని కొత్త ప్యూచర్స్ కలిగిన వాహనంలో సౌండ్ సిస్టమ్స్ సినిమా ధియేటర్లో ఉన్న అనుభవాన్ని ఇస్తుంది. డాల్బిఅటమాస్ సౌండ్ సిస్టిమ్స్ ఉంది. ధర రూ. 7లక్షల నుంచి మొదలుకొని సామాన్యుడికి కావాల్సిన సరసమైన ధరల్లో ఉంది.
-కాంచన, సీనియర్ రిలేషిన్ షిప్ మేనేజర్, వరుణ్మోటర్స్)

Atuo Show Lo Sandarshakulu
అందుబాటులో ఎల్రక్ట్రికల్ వాహనాలు
హ్యుందయ్ షోరూంలో ఎలక్ట్రికల్ వాహనాలు అందు బాటులో ఉన్నాయి. ఇవి 42 కిలోవాట్ రూ. 19లక్షలు , 54 కిలోవాట్ రూ. 24లక్షల ధరతో ఉన్నాయి. కొత్తగా కమర్షియల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
-లోహిత్ రాజ్ , ప్రకాశ్ హ్యుందయ్, కార్పొరేట్ సేల్స్ కన్సల్టెంట్
అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి..
మహేంద్ర షోరూంలో అద్భుతమైన ఫీచర్స్ ఉన్న కార్లు అందుబాటులో ఉన్నాయి. ధర రూ. 7.36 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు లభిస్తాయి. తార్రాక్స్ కారు నూతనంగా లాంచ్చేశాం. వందకుపైగా అమ్ముడు పోయాయి. ప్రతి ఒక్కరి బడ్జెట్‌కు తగ్గట్లుగా ఉన్నాయి.
-లక్ష్మీకాంత్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఆటోమోటివ్ (మహేంద్ర షోరూం)
మంచి స్పందన కనబడుతుంది
నమస్తే ఆటోషోకు మంచి స్పందన కనబడుతుంది. సాయి రాం హోండా వాహనాలను అమ్ముతున్నాం. రూ. 97వేల నుంచి రూ. లక్షా 80వేల వరకు ధరలు పలుకుతున్నాయి. రూ. 1.2 లక్షల నుంచి 1.29 లక్షల వరకు ధరపలుకుతుంది.
-ఉదయ్, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సాయిరాం హోండా
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది
రాయల్‌ఎన్‌ఫీల్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రూ. 1.90 లక్షల నుంచి రూ. 5.50 లక్షల వరకు ధరలు ఉన్నాయి. 13 రకాల వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా మంది టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. క్లాసిక్ , హంటర్, బుల్టెట్ అత్యధిక సేల్స్ అవుతున్నాయి.
-రమేశ్, జనరల్ మేనేజర్, దేవి ఆటో మోబైల్స్, రాయల్ ఎన్ఫీల్డ్
ఎప్పటికీ మన నేస్తం టీవీఎస్
ఎప్పటికి మన నేస్తం అనే విధంగా టీవీఎస్ ఉంటుంది.
మన చిన్నతనం నుంచి ఎక్స్‌ల్ బండి మొదలుకొని అత్యాధునిక బైక్‌లను తయారుచేసిన సంస్థ టీవీఎస్. వాహన ధరలు రూ. 56 వేల నుంచి మొదలుకొని రూ. 3.30లక్షల వరకు ఉన్నాయి.
-బోజేందర్, జనరల్ మేనేజర్, లక్ష్మీ టీవీఎస్
అన్నింటిలో హీరోనే
హీరో కంపెనీ అంటే అందరికీ తెలుసు.బైక్స్‌లో అన్నింటిలోనూ ముందుంటుంది. స్కూటర్స్, బైక్‌లు రూ. 80 వేల నుంచి రూ. 2లక్షలవరకు అందుబాటులో ఉన్నాయి. అత్యధునిక టెక్నాలజీలతో నూతన బైక్‌లు ఉన్నాయి.
-చిరంజీవి, టీం లీడర్, వెంకటేశ్వర హీరో షోరూం
భారీ స్పందన లభించింది
ఆటో షోకు స్పందన బాగుంది. టాటా కంపెనీ అంటేనే పెట్టింది పేరు. అందులో నూతన ఎలక్ట్రానిక్ కార్లు దూసుకుపోతున్నాయి. రూ. 6లక్షల నుంచి రూ.31లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాహనాల్లో ముందంజలో ఉంది.
-శంకర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, శ్రీ వెంకటేశ్వర మోటర్స్(టాటా కంపెనీ)