నర్సంపేట, ఫిబ్రవరి 22: నిరుపేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్య సేవలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో డివిజన్లోని నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి మండలాలకు చెందిన 68 మందికి రూ. 31.40 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్వోసీలను పెద్ది మంగళవారం పంపిణీ చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్యశాలలను ఆధునీకరించి మెరుగైన వసతులు కల్పిస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంలో లేని జబ్బులకు ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన వారిని ఆర్థికంగా ఆదుకునేందకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందిస్తున్నారని వెల్లడించారు. ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకున్న తర్వాత రోగులు ఒరిజనల్ బిల్లులను దరఖాస్తుతోపాటు అందిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు అందిస్తామన్నారు. రోగులు వైద్యశాలల్లో చేరకముందే వైద్యానికయ్యే ఖర్చు ఎస్టిమేట్ వేసి అందిస్తే ఎల్వోసీ అందజేస్తామని సూచించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో రాష్ట్రంలోనే నర్సంపేట నియోజకవర్గం మూడో స్థానంలో ఉందన్నారు. ఏం చేసినా సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, సత్యనారాయణ, బాల్నె వెంకన్నగౌడ్, బుర్రి తిరుపతి, సూరయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
విలీన గ్రామం కమలాపురానికి పట్టణ విద్యుత్
నర్సంపేట మున్సిపాలిటీలో విలీనమైన కమలాపురానికి పట్టణ విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మంగళవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. రూ. 58 లక్షల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం కమలాపురానికి పట్టణం నుంచి విద్యుత్ సౌకర్యం కల్పించిందని తెలిపారు. కార్యాక్రమంలో కమలాపురం వార్డు కౌన్సిలర్ జుర్రు రాజు, డీఈ మృత్యుంజయరావు, టీఆర్ఎస్ నాయకులు నాగెల్లి వెంకటనారాయణ, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పెద్ది దంపతులకు శుభాకాంక్షలు..
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వాణిదేవి, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. క్యాంపు కార్యాలయ ఆవరణలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మొక్క నాటారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నామాల సత్యనారాయణ, గంప రాజేశ్వర్‌గౌడ్, పుట్టపాక కుమారస్వామి, వంశీ, మండల శ్రీనివాస్, అనిల్, యాదగిరి, వెంకటేశ్వర్లు, ఎంపీపీ, జడ్పీటీసీలు, సొపైటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఏసీపీ ఫణీందర్, సీఐలు పులి రమేశ్, సూర్యప్రసాద్ పాల్గొన్నారు. అలాగే, నల్లబెల్లి, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, దుగ్గొండి, నర్సంపేట మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు క్యాంపు ఆఫీస్‌కు తరలివచ్చి పెద్ది దంపతులకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణాన్ని కాపాడుదాం
నల్లబెల్లి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. తన పెండ్లి రోజు సందర్భంగా నల్లబెల్లిలోని తన స్వగృహం ఆవరణలో సతీమణి పెద్ది స్వప్నతో కలిసి సుదర్శన్‌రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యే దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, సీఐ ఎర్రల కిరణ్, సర్పంచ్‌లు ఎన్ రాజారాం, లావుడ్యా తిరుపతి, మాజీ ఎంపీపీ పాలెపు రాజేశ్వర్‌రావు, కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, తేజావత్ సమ్మయ్యనాయక్, వక్కల చంద్రమౌళి, సట్ల శ్రీనివాస్‌గౌడ్, గుమ్మడి వేణు, మామిండ్ల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
వధూవరులకు పెద్ది దంపతుల ఆశీర్వాదం
నెక్కొండ/చెన్నారావుపేట: నెక్కొండ మండలం గుండ్రపల్లి సర్పంచ్ బోంపెల్లి రాజేశ్వర్‌రావు తమ్ముడు రాజశేఖర్ రిసెప్షన్‌కు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట ఎంపీపీ జాటోత్ రమేశ్, సొసైటీ చైర్మన్ మారం రాము, రెడ్లవాడ సొసైటీ చైర్మన్ జలగం సంపత్‌రావు, జడ్పీటీసీ లావుడ్యా సరోజన హరికిషన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, బోంపెల్లి శ్రీనివాసరావు, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, రెడ్లవాడ సొసైటీ మండల నాయకులు గుంటుక సోమయ్య, మాదాసు రవి, సారంగపాణి, నెక్కొండ ఉప సర్పంచ్ డీ వీరభద్రయ్య ఉన్నారు. చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో టీఆర్ఎస్ కార్యకర్త బోడ మురళి-రోజా వివాహ రిసెప్షన్‌కు ఎమ్మెల్యే దంపతులు హాజరై ఆశీర్వదించి కానుకలు అందించారు. వారి వెంట జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ ఎంపీపీ జక్క అశోక్‌యాదవ్, చెరువుకొమ్ముతండా సర్పంచ్ విజయా బద్దూనాయక్, ఖాదర్‌పేట సర్పంచ్ కుమారస్వామి, టీఆర్ఎస్ మండల నాయకులు కృష్ణచైతన్యారెడ్డి, తొగరు చెన్నారెడ్డి, రమేశ్‌నాయక్ ఉన్నారు.
నెక్కొండ: ఎమ్మెల్యే పెద్ది దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట క్యాంపు కార్యాలయంలో వనప్రేమికుడు నల్లగొం డ సమ్మయ్య కొబ్బరి మొక్క నాటారు. సమ్మ య్య స్ఫూర్తితో యువత విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని పెద్ది కోరారు.