దుగ్గొండి, ఫిబ్రవరి 16: మిర్చి తోటలకు సోకిన తామర పురుగును అరికట్టాలంటే ఆది నుంచి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం శాస్త్రవేత్తలు సునీత, నీలారాణి, విద్యశ్రీ, సుధ రైతులకు సూచించారు. మండలంలోని తిమ్మంపేట, గుడ్డేలుగులపల్లిలో దెబ్బతిన్న మిర్చి పంటలను బుధవారం స్థానిక వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పంటను పరిశీలించి తామరపురుగుతో మిర్చి పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు. ముఖ్యంగా తేజ, 341, చపాట తోటలను తామర పురుగు తీవ్రంగా ఆశించిదన్నారు. తామరపురుగు నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపించామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ తోట శ్రీనివాసరావు, హార్టికల్చర్ అధికారి శ్రీనివాసరావు, హెచ్‌వో శంకర్ దుగ్గొండి ఏవో దయాకర్, ఏఈవోలు రాజేశ్ విశ్వశాంతి, మధు, హన్మంతు, హెచ్‌వో తిరుపతి, సర్పంచ్ మోడెం విద్యాసాగర్‌గౌడ్, రైతులు పింగిళి రాఘవరెడ్డి, పెండ్యాల సాంబయ్య, మంద ఈశ్వరయ్య, తోటకూరి నాగరాజు పాల్గొన్నారు.