నర్సంపేట, ఫిబ్రవరి 15: దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కొనియాడారు. కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా నర్సంపేట ఏరియా దవాఖానలో మంగళవారం రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్‌లోని అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు ఆకట్టుకున్నాయి. సీఎం కేసీఆర్ తెలంగాణలో కారణజన్ముడని పెద్ది అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, దవాఖాన సూపరిండెంటెంట్ డాక్టర్ గోపాల్, రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, రాయిడి దుశ్యంత్‌రెడ్డి, గంపరాజేశ్వర్గౌడ్, పెండెం వెంకటేశ్వర్లు, మండల శ్రీనివాస్, నాగిశెట్టి ప్రసాద్, రుద్ర ఓంప్రకాశ్, సారంగం, యాదగిరి, యువరాజు, పుట్టపాక కుమారస్వామి, పుల్లూరి స్వామిగౌడ్ పాల్గొన్నారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు వెంకటనారాయణగౌడ్ చేతులమీదుగా ఆటో డ్రైవర్లకు పండ్లు పంపిణీ చేశారు.
దుగ్గొండి: కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలకు ఓ వరమని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. గిర్నిబావిలో టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదానం కార్యక్రమాన్ని పెద్ది ప్రారంభించి మాట్లాడారు. సమైక్య పాలనలో ఆగమైన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, సర్పంచ్ కూస సమతారాజు, టీఆర్ఎస్ మండలాద్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, పొన్నం మొగిలి, గుండెకారి రంగారావు, ఊరటి మహిపాల్‌రెడ్డి, పిన్నింటి తిరుపతిరెడ్డి, కంచకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, శంకేసి కమలాకర్, బానోత్ రవీందర్‌నాయక్, టీఆర్ఎస్ ఎస్సీసెల్ దుగ్గొండి మండలాధ్యక్షుడు మంద శ్రీనివాస్, రాంబాబు, రజినీకర్‌రెడ్డి, నగరబోయిన తిరుపతి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
వరంగల్‌చౌరస్తా/కాశీబుగ్గ/పోచమ్మమైదాన్: ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాలకు సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. ఆర్ఎన్టీ రోడ్డులో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, మాజీ మేయర్ గుండా ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, డాక్టర్ హరి రమాదేవి, తొనుపునూరి వీరన్న, తోట హరీశ్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కాశీబుగ్గలోని మదర్ థెరిస్సా అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఎర్రబెల్లి ప్రదీపురావు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఎల్బీనగర్లో పండ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, ఆకారపు మోహన్, కొల్లూరు యోగానంద్, ఎంఎస్ పాషా, కృష్ణకిశోర్, హరికుమార్, నైనాశ్గౌడ్, కృష్ణ, సురేశ్ పాల్గొన్నారు. ఆటోనగర్‌లోని లూయీస్ ఆదర్శ అంధుల పాఠశాలలో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, యెలుగం శ్రీనివాస్ పాల్గొన్నారు. తిలక్‌రోడ్డులో టీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు ముష్కె ప్రమీల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్థానికులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కవిత, భారతమ్మ, గ్రేషమ్మ, సునీత, స్వరూప, భాగ్యలక్ష్మి, సంపత్, అశోక్, కుమారస్వామి పాల్గొన్నారు.