కరీమాబాద్, ఫిబ్రవరి 15: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉర్సులోని ఆర్యసమాజంలో 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి-భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో దేవయాగం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యసమాజ మంత్రి గుడమెల్ల వేదప్రకాశ్, నాయకులు వొగిలిశెట్టి అనిల్‌కుమార్, వనం మధు, వనం కుమార్, కర్ర కుమార్, పసునూరి రమేశ్, మిరియాల ఆదిత్య పాల్గొన్నారు. 43వ డివిజన్లోని ఎనగందుల వృద్ధాశ్రమంలో కార్పొరేటర్ అరుణ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేపట్టారు.
ఖానాపురం/చెన్నారావుపేట/సంగెం/నర్సంపేటరూరల్/వర్ధన్నపేట/నెక్కొండ/పర్వతగిరి: సీఎం కేసీఆర్ సేవలు దేశానికి ఎంతో అవసరమని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఖానాపురంలోని పీహెచ్సీలో రోగులకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, వేజళ్ల కిషన్‌రావు, ఎంపీటీసీలు మర్రి కవిత, బోడ భారతి, దాసరి రమేశ్, రెడ్డి నాగార్జునరెడ్డి, మచ్చిక అశోక్, రమేశ్, సర్పంచ్ ఐలయ్య పాల్గొన్నారు.
చెన్నారావుపేటలోని కేజీబీవీలో విద్యార్థినులకు టీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, పత్తినాయక్‌తండా సర్పంచ్ జాటోత్ స్వామినాయక్, కంది కృష్ణచైతన్యారెడ్డి, మహేందర్‌రెడ్డి, నర్సింగరావు, ఆర్బీఎస్ తిమ్మరాయనిపహాడ్ కన్వీనర్ ప్రదీప్‌కుమార్, గ్రామ అధ్యక్షుడు సాంబయ్య, సొసైటీ డైరెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
సంగెంలోని పీహెచ్సీలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, ఎంపీపీ కళావతి, సర్పంచ్‌లు బాబు, కిశోర్‌యాదవ్, కుమారస్వామి, బిచ్చానాయక్, పోతుల ప్రభాకర్, ఎంపీటీసీ మల్లయ్య, మాజీ ఎంపీపీ వీరాచారి, నరహరి, దోపతి సమ్మయ్య, కొనకటి మొగిలి, జగన్నాథచారి, సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, మన్సూరల్ అలి, గన్ను సంపత్ పాల్గొన్నారు.
నర్సంపేట మండలం మహేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎంపీపీ మోతె కళాపద్మనాభరెడ్డి, భాంజీపేట పీహెచ్‌సీలోని రోగులకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో వేర్వేరుగా పండ్లు పంపిణీ చేశారు. పీహెచ్సీ వైద్యాధికారి భూపేశ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, కట్ల సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా వీరన్న, బీసీసెల్ మండల అధ్యక్షుడు పెండ్యాల సదానందం, పెద్ది తిరుపతిరెడ్డి, గంధం జగన్మోహన్రావు, ఉప్పుల భిక్షపతి, రాజిరెడ్డి, ఎండీ జాఫర్, జరుపుల వీరన్న, బొజ్జ స్వామి, టీఆర్ఎస్ మహేశ్వరం గ్రామ అధ్యక్షుడు చేరాల గోవర్ధన్, నాయకులు ముస్కుల దేవేందర్‌రెడ్డి, పిన్నింటి దేవేందర్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ దౌడు రవి, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ చక్రపాణి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మున్సిపల్ వైస్‌చైర్మన్ కోమాండ్ల ఎలేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాయకులు పులి శ్రీనివాస్, మైస రాము, రహీమొద్దీన్, తిరుపతి, సురేశ్, గుడ్ల సుభాష్ పాల్గొన్నారు. కట్య్రాల పరిధి ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డులోని ఫంక్షన్ హాల్లో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే శిబిరంలో యువకులు, కేసీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
నెక్కొండ జడ్పీఎస్ఎస్లోని విద్యార్థులకు టీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యాక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్‌నాయక్, సొసైటీ చైర్మన్ మారం రాము, జడ్పీటీసీ లావుడ్యా సరోజనా హరికిషన్, రెడ్లవాడ సొసైటీ చైర్మన్ జలగం సంపత్‌రావు, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, ఉప సర్పంచ్ వీరభద్రయ్య, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, నాయకులు పాల్గొన్నారు.
పర్వతగిరిలో సర్పంచ్ చింతపట్ల మాలతీరావు పండ్లు పంపిణీ చేశారు. ఆర్బీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు సోమేశ్వర్రావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితెందర్‌రెడ్డి, నాయకులు పంతులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు సర్వర్, సర్పంచ్‌లు రమేశ్, వెంకన్ననాయక్, ఎంపీటీసీలు మాడ్గుల రాజు, పర్వతగిరి ఉపసర్పంచ్ రంగు జనార్దన్, మాజీ ఎంపీటీసీ యాలాద్రి, రమేశ్, నాయకుడు బాబు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మేరుగు వెంకటేశ్వర్లు, నాయకులు బరిగెల విజయ, కుమారస్వామి, బొట్ల మధు పాల్గొన్నారు.