జయశంకర్ భూపాలపల్లి, మే 13(నమస్తేతెలంగాణ): జిల్లాలో వానాకాలం పంటల సాగుకు వ్యవసా య శాఖ అధికారులు పంటల సాగు ప్రణాళికలను సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 11 మండలాల పరిధి లో సాగుకు యోగ్యమైన భూకమతాలను అంచనా వేసి, అందుకు సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తీసుకురావడానికి అంచనాలను రూపొందించారు. గతేడాది వానాకాలం కన్నా ఈ సారి పంటల సాగు విస్తీర్ణంలో భారీగా తేడాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. గతేడాది వానాకాలంలో 2,56,639 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయగా, ఈసారి 2,73,220 ఎకరాల్లో సాగు చేయను న్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది వరి పంటను1,06,990 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 1,01,600 ఎకరాల్లో వేయనున్నారు. పత్తి పంటను గతేడాది 89,709 ఎకరాల్లో వేయగా, ఈ సంవత్సరం 1,18,600 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. గతేడాది మిర్చికి వైరస్ తెగులు సోకి తీవ్రంగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో రైతులు ఈసారి ఆ పంటపై కొంత అనాసక్తిగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పోయినసారి 30, 455 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేయగా, ఈ ఏ డాది 26,850 ఎకరాలకు పరిమితం చేయనున్నారు.
పెరుగనున్న సాగు విస్తీర్ణం..
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో జిల్లాలోని 241 గ్రా మపంచాయతీల పరిధిలో నీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో ఈ సారి సాగు విస్తీర్ణం కూడా భారీగా పె రుగనుంది. గతేడాది 2,56,639 ఎకరాల్లో పంటలను సాగు చేయగా, ఈసారి 2,73,220 ఎకరాల్లో వేయను న్నారు. గతేడాది వానాకాలం కన్నా 16,581ఎకరా ల్లో అదనంగా సాగు చేయనున్నారు. ఈ సంవత్సరం 26,850 ఎకరాల్లో మిర్చి, కందులు 460 ఎకరాలు, పెసర 350 ఎకరాలు, మినుములు 75 ఎకరాలు, వేరుశనగ 25 ఎకరాలు, మక్కజొన్న 560 ఎకరాలు, ఇతర పంటలు 24,700 ఎకరాల్లో సాగు చేయనున్న ట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
పత్తి సాగుపై పెరుగుతున్న ఆసక్తి..
గతేడాది కన్నా ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం అనుహ్యంగా పెరుగనుంది. గత సంవత్సరం 89,709 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 1,18,600 ఎకరాల్లో సాగు చేయనున్నారు. వరి పంట సాగు విస్తీర్ణం కొంత మేర తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. గత ఏడాది వానాకాలంలో 1,06,990 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, ఇప్పుడు 1,01,600 ఎకరాల్లో సాగు చేయనున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
రైతులు వానాకాలం పంటల సాగుకు సంబం ధించిన విత్తనాల కొను గోలులో జాగ్రత్తలు పాటించాలి. నాణ్యమైన, మేలు రకం, అధిక దిగు బడులనిచ్చే విత్తనాల ను మాత్రమే కొనాలి, దళా రుల మాటలను నమ్మి మోసపోవద్దు. విత్తనాల గురించి తెలియని వారు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
– విజయభాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జయశంకర్ భూపాలపల్లి