దుగ్గొండి/ఖానాపురం, డిసెంబర్ 21: జాతీయ విద్యా విధానం 2020 (ఎన్పీఎస్), నూతన పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) వెంటనే రద్దు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ కోరారు. దేశవ్యాప్త క్యాంపెయిన్‌లో భాగంగా టీఎస్‌యూటీఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని పలు పాఠశాలను సందర్శించారు. అనంతరం గిర్నిబావిలోని ఎంజేపీటీలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ మాట్లాడుతూ సీపీఎస్ అమలు, రద్దు రాష్ట్ర పరిధిలోని అంశమని, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇవ్వాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బద్దం వెంకట్‌రెడ్డి, రవీందర్, రవూప్, రమేశ్ మండల బాధ్యుడు మహేశ్, కుమారస్వామి, ఉపాధ్యాయుడు ప్రభాకర్ పాల్గొన్నారు. అలాగే, టీఎస్‌యూటీఎఫ్ ఖానాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు పలు పాఠశాలలను సందర్శించారు. ఖానాపురం ప్రభుత్వ పాఠశాలలో సంఘం జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ విద్యా విధానం అమలు చేస్తున్నదని ధ్వజమెత్తారు.