కరీమాబాద్, డిసెంబర్ 11 : స్వామియే శరణం అయ్యప్ప అంటూ మాలధారుల శరణు ఘోష మార్మోగింది. నాగమయ్య కుటీరం, అయ్యప్ప సేవా సమితి, అయ్యప్ప పరపతి సంఘం, హరిహరపుత్ర పరపతి సంఘం ఆధ్వర్యంలో ఉర్సులోని నాగేంద్రస్వామి ఆలయ సమీపంలోని కుటీరం వద్ద ఆదివారం అయ్యప్ప స్వామి పడిపూజ కనుల పండువగా జరిగింది. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పోశాల పద్మ, మాజీ కార్పొరేటర్లు బత్తిని వసుంధర, నాగపురి కల్పన తదితరులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ : వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటలోని సాయిబాబా దేవాలయంలో జరిగిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.