వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 11: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోవిందాద్రి ఉత్సవమూర్తుల ఉపాలయంలో ఆదివారం సామూహిక అనఘాష్టమి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. 27వ డివిజన్ గోవిందరాజులస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా విశేష పూజలందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు వరయోగుల శ్రీనివాసస్వామి, గోవిందాద్రి గోశాల వ్యవస్థాపకుడు వరయోగుల లక్ష్మణస్వామి మాట్లాడుతూ లోకకల్యాణార్థం ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సామూహిక అనఘాష్టమి వత్రంతోపాటు అన్నదానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు ఇప్ప ఆదినారాయణ, భూపతి గౌరీశంకర్, సంగినేని స్వామి, బోళ్ల ఈశ్వర్, సంగినేని దేవేందర్, కొమ్ము సుధాకర్, జారతి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్ పాల్గొన్నారు.