నర్సంపేట, డిసెంబర్ 10: టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ ఇటీవల ఎన్నికల కమిషన్ ఆమోదముద్ర వేయడంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్తంగా విస్తరించనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గంటి రజినీకిషన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ మాట్లాడుతూ దేశ ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఏర్పాటు వల్ల తెలంగాణలో అమలవుతున్న ప్రతి పథకం ఫలాలు దేశంలోని ప్రజలందరికీ అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ను దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు ఆహ్వానిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్లా మనోహర్‌రెడ్డి, నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు రాయిడి దుశ్యంత్‌రెడ్డి, వేణుముద్దల శ్రీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు రాయిడీ కీర్తి దుశ్యంత్‌రెడ్డి, దార్ల రమాదేవి, జుర్రు రాజు, గందె రజిత, దేవోజు తిరుమల, మచ్చిక నర్సయ్యగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు వీరన్న, సర్పంచ్ కడారి రవి, ఇర్ఫాన్, రాయరాకుల సారంగం, సురేశ్, సాలయ్య, బాబు, రవి, శివకోటి, వాసం కరుణ, కొమ్ముల కరుణాకర్, పుల్లూరి స్వామిగౌడ్, పుట్టపాక కుమారస్వామి, చుక్కా అనిల్, మంద ప్రసాద్, బైరి మురళి, అప్పాల సుదర్శన్ పాల్గొన్నారు.
ఘనంగా బీఆర్ఎస్ సంబురాలు
దుగ్గొండి: బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను మండలవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు మండలకేంద్రంతోపాటు గిర్నిబావి సెంటర్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తు హాజరై పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎంపీపీ కాట్ల కోమలా భద్రయ్య మాట్లాడుతూ సువర్ణ భారతదేశ నిర్మాణానికి బీఆర్ఎస్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జులు కంచరకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, భూంపెల్లి రజినీకర్‌రెడ్డి, పుచ్చకాయల బుచ్చిరెడ్డి, సింగతి రాజన్న, సర్పంచ్‌లు మోడెం సాగర్, ఓడేటి తిరుపతిరెడ్డి, మోగ్గం మహేందర్, సింగనబోయిన లింగన్న, మండల నాయకులు నూతనకంటి శ్రీనివాస్, యార శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి, కోటి, శంకర్, రమేశ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ మార్పుపై ఎమ్మెల్సీ పూజలు
పోచమ్మమైదాన్: టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దంపతులు పోచమ్మమైదాన్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఇక నుంచి బీఆర్ఎస్ ప్రజల్లోకి దూసుకెళ్లి, మరింత ప్రజాబలం పెరుగాలని కోరుతూ పూజలు చేసినట్లు వారు తెలిపారు.
మార్మోగిన నినాదాలు..
చెన్నారావుపేట: మండలకేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన జై భారత రాష్ట్ర సమితి.. జై కేసీఆర్ నినాదాలతో మండలకేంద్రం మార్మోగింది. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు గఫార్, పార్టీ గ్రామ అధ్యక్షుడు సాంబయ్య, కుసుమ నరేందర్, నర్మెట్ట సాంబయ్య, శ్రీధర్‌రెడ్డి, బండి ఉపేందర్ పాల్గొన్నారు.