ఖానాపురం, మార్చి 10 : మండలంలోని అశోక్‌నగర్ ఎస్సీ కాలనీని గురువారం ట్రైనీ సివిల్ సర్వీస్ ఉద్యోగులు సందర్శించారు. కాలనీ వాసులతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుని నోటు చేసుకున్నారు. అనంతరం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఎంపీడీవో సుమనావాణి, సర్పంచ్ గొర్రె కవితతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ..ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారుల పర్యటన ముగిసిందన్నారు.
నల్లబెల్లి : మండలంలోని కొండాపురం పల్లె ప్రకృతి వనాన్ని ట్రైనీ ఐఏఎస్‌లు పరిశీలించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా పని చేసిన మేట్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, సర్పంచ్‌లు తిరుపతమ్మ, చింతపట్ల సురేశ్, పంచాయతీ కార్యదర్శులు రజిత, రంజిత్, ఏపీవో వెంకటనారాయణ, టీఏలు సాయికృష్ణ, నరేశ్, ఈసీ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
రాయపర్తి : మండలంలోని తిర్మలాయపల్లిలో జీపీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ గజవెల్లి అనం త ప్రసాద్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో నాలుగు రోజులుగా పర్యటిస్తున్న శిక్షణ ఐఏఎస్, ఐపీఎస్, ఎఎఫ్ఎస్, ఐఆర్ఏఎస్, ఐడీఎస్ఈ అధికారుల సమక్షంలో గ్రామంలో చేస్తున్న ప్ర జా సంక్షేమ, గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి మాట్లాడారు. శిక్ష ణ అధికారులు నవేంద్ శేఖర్, వినోద్‌కుమార్ మీ నా, హిమంత్ సింగ్ ఉజ్వల్, ఇంద్ర బదన్ ఝా, ప్ర త్యూష్ కుమార్ పాండే, ఉప సర్పంచ్ గుడి యుగేంధర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నల్లతీగల సంతోష్‌కుమార్, కారోబార్ రత్నాకర్ పాల్గొన్నారు.