కాశీబుగ్గ, మార్చి 10 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర రోజుకో కొత్త శిఖరాన్ని తాకుతున్నది. గురువారం సింగిల్పట్టి మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ.42 వేలు పలికింది. ములుగు జిల్లా పంచోత్కులపల్లి గ్రామానికి చెందిన పోలెనేని సత్యనారాయణ రావు సింగిల్పట్టి రకం మిర్చి 5 బస్తాలు మార్కెట్‌కు తీసుకురాగ, బాబా ఎంటర్ప్రైజెస్ అడ్తి ద్వారా రాజరాజేశ్వర చిల్లీస్ వ్యాపారి క్వింటాల్‌కు రూ.42వేలతో కొనుగోలు చేశాడు. మిర్చి ధర రోజురోజుకు పైకి ఎగబాకుతుండడంతో అన్నదాతలు ఖుషా అవుతున్నారు. కాగా, గురువారం మార్కెట్‌కు సుమారు 40వేల మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.