వరంగల్ చౌరస్తా, మార్చి 3: టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని గురువారం యాకుబ్పురాలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నరేందర్ హాజరు కాగా.. నిర్వాహకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులకు సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నన్నపునేని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యంతో పౌష్టికాహారం అందిస్తున్నదన్నారు. తర్వాత ఎమ్మెల్యే విద్యార్థులతో సెల్ఫీలు దిగి యోగక్షేమాలు, హాస్టల్లో వసతులు, విద్యాభోదనను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే షేక్‌హ్యాండ్ ఇస్తూ, సెల్ఫీలు దిగడంతో చిన్నారుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. కార్యక్రమంలో కార్పొరేటర్ సిద్దం రాజు, మాజీ కార్పోరేటర్ జారతి రమేశ్, మైనార్టీ నాయకులు మసూద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: వరంగల్ దేశాయిపేటలో నిర్మించిన కైలాసగిరి అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం ఆయన ఆలయ సమూహాన్ని సందర్శించారు. 30 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేసిన పార్వతీపరమేశ్వరుల విగ్రహాలు, శివలింగాన్ని పరిశీలించారు. కార్తికేయ, వినాయక, ఆది శంకరాచార్యులు, నంది విగ్రహాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే, స్థానిక షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీరన్నగుడి నిర్మాణంలో భాగంగా స్లాబ్ పనులను ప్రారంభించారు. దేశాయిపేట బొడ్రాయి వద్ద ఉన్న రంగనాయకస్వామి ఆలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, స్థానిక కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, సురేశ్‌కుమార్ జోషితోపాటు నాగార్జున వెంకటేశ్వర్లు, వరంగల్ తాసిల్దార్ సత్యపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అంతేకాకుండా పోచమ్మమైదాన్ నుంచి సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు ఏర్పాటు చేయనున్న డివైడర్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ. 80 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.