JEE Main | వెబ్సైట్లో జేఈఈ మెయిన్ ఫైనల్ కీ.. ఇవాళే ఫలితాలు వెల్లడించే ఛాన్స్..!
JEE Main | జేఈఈ మెయిన్-2026 (JEE Main-2026) ఫలితాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో NTA అధికారులు సోమవారం ఉదయం ఫైనల్ కీ విడుదల చేశారు. ఏ క్షణంలోనైనా ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.
JEE Main : జేఈఈ మెయిన్-2026 (JEE Main-2026) ఫలితాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో NTA అధికారులు సోమవారం ఉదయం ఫైనల్ కీ విడుదల చేశారు. ఏ క్షణంలోనైనా ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12 నాటికే జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేశారు.
ఫిబ్రవరి 16 లోపు ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. అయితే తాజాగా ఫైనల్ కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎన్టీఏ అధికారులు వెల్లడించిన ప్రకారమైతే ఏ క్షణంలోనైనా జేఈఈ మెయిన్-2026 ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఫలితాలు వెల్లడైన తర్వాత అభ్యర్థులు తమ రిజల్ట్స్ ను జేఈఈ మెయిన్ వెబ్సైట్ jeemain.nta.nic.in, ఎన్టీఏ వెబ్సైట్ nta.ac.in లలో చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలను ఎంటర్ చేసి స్కోర్ కార్డును పొందవచ్చు. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం జనవరి 21 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ తొలివిడత (పేపర్ 1, పేపర్ 2) పరీక్షలు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా పేపర్-1 (బీఈ/బీటెక్) కు దాదాపు 13.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో దాదాపు 95 శాతం మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి ఫిబ్రవరి 4న ప్రొవిజినల్ కీని విడుదల చేసిన అధికారులు.. ఈనెల 6 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. వాటి ఆధారంగా తాజాగా ఫైనల్ కీ విడుదల చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

