జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ ఉద్రిక్తత.. కౌన్సిలర్ కిడ్నాప్ అంటూ హైడ్రామా
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ హైడ్రామా నెలకొంది. 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిడ్నాప్ అయ్యిందని, వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని తెలిపారు.
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ హైడ్రామా నెలకొంది. 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిడ్నాప్ అయ్యిందని, వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆమెను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. విచారణ చేయాలంటూ ఫాతిమాను పోలీస్ స్టేషన్కు తరలించేందుకు యత్నించారు. అయితే పోలీసులను జనగామ ఎమ్మెల్యే పల్లా అడ్డుకున్నారు. ఈ క్రమంలో డీసీపీతో వాగ్వాదానికి దిగారు.
కాగా, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఫాతిమా స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచానని.. ఆ పార్టీకే మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. కాగా, జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఆపాలంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ హాఫిజ్ ఫాతిమా హాజరైనా మిస్సింగ్ కేసు నమోదైందంటూ చామల వితండవాదం చేశారు. కోరం సభ్యులు అందరూ హాజరైనందుకు ఎన్నిక ఆపడం కుదరదంటూ అధికారులు చామలకు తేల్చిచెప్పారు. నిబంధనల ప్రకారం కోరం మొత్తం హాజరైన నేపథ్యంలో చైర్మెన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయలేమంటూ ప్రొసీడింగ్ అధికారులు తేల్చిచెప్పారు
జనగామ మున్సిపాలిటీలో పోలీసుల ఓవర్ యాక్షన్
బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు
ఆమె కిడ్నాప్ అయిందని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, ఆమెను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నం
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను బీఆర్ఎస్… pic.twitter.com/qCfX2XJe3K
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

