ములుగురూరల్, ఆగస్టు 20: ములుగు జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో కేంద్ర ఆరోగ్యశాఖ కమిటీ సభ్యులు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు వైద్యులను ఓపీతో పాటు ఐపీ సేవలు, ప్రసవాలు, కేసీఆర్ కిట్లు అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రాథమికంగా అన్ని రకాల ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి పీహెచ్సీలో వైద్యసిబ్బంది రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వారి వెంట దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్, డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య, వైద్యులు నవ్యరాణి, నరేశ్, వైద్యసిబ్బంది ఉన్నారు.