దుగ్గొండి/ఖానాపురం/రాయపర్తి, ఆగస్టు 9: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు త్రివర్ణ పతాకాలను ప్రజలకు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం దుగ్గొండి మండలంలోని శివాజీనగర్, నాచినపల్లి, తిమ్మంపేట, రేఖంపల్లి, దుగ్గొండి, మందపల్లిలో సర్పంచ్ల ఆధ్వర్యంలో అధికారులు గ్రామస్తులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, సర్పంచ్‌లు ఉమారవీందర్రావు, శారదాకృష్ణ, విద్యాసాగర్‌గౌడ్, మమతారాజు, యుగేంధర్, మహేందర్, ఉర్మిళావెంకన్న పాల్గొన్నారు.
ఖానాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 22 వరకు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఎంపీడీవో సుమనావాణి, డీటీ సృజన్‌కుమార్, ఆర్ఐ సత్యనారాయణ, సర్పంచ్‌లు కాస ప్రవీణ్‌కుమార్, బాలకిషన్ పాల్గొన్నారు. రాయపర్తి మండలంలో సర్పంచ్‌లు, గ్రామ ప్రత్యేకాధికారుల సమక్షంలో జీపీల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జాతీయ పతాకాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీవో తుల రామ్మోహన్, ఎస్సై బండారి రాజు, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ రాంచందర్, పూస మధు, వనజారాణి, నయీం, సుధాకర్, రామ్‌యాదవ్, నర్సింహ్మమూర్తి, చిన్నాల తారాశ్రీరాజబాబు తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి/సంగెం/నర్సంపేట/గీసుగొండ/నర్సంపేటరూరల్: ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటుదామని నల్లబెల్లి ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ పిలుపునిచ్చారు. లెంకపెల్లి, నల్లబెల్లి తదితర గ్రామాల్లో ఇంటింటికీ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. సర్పంచ్ నానెబోయిన రాజారాం, ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎస్సై రాజారాం, ఎంపీటీసీ జన్ను జయరావ్, కార్యదర్శి ధర్మేందర్, సట్ల శ్రీనివాస్‌గౌడ్, భట్టు సాంబయ్య, నవీన్, పరికి కోర్నేల్, పురం సతీశ్, ప్రదీప్, సాగర్, సద్దాం పాల్గొన్నారు. సంగెం ఎంపీడీవో కార్యాలయంలో వజ్రోత్సవాలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిపై మూడు రంగుల జెండా ఎగిరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాసిల్దార్ రాజేంద్రనాథ్, ఎంపీడీవో మల్లేశం, ఎస్సై పెండ్యాల దేవేందర్, ఎంపీవో కొమురయ్య, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, ఏవో సీహెచ్ యాకయ్య, గుగులోత్ వీరమ్మ, దొనికెల శ్రీనివాస్, మెట్టుపెల్లి మల్లయ్య, గన్ను సంపత్, బాబు పాల్గొన్నారు. నర్సంపేటలో డీసీపీ వెంకటలక్ష్మి జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు జాతీయ జెండాలను ఇండ్లపై ఎగురవేయాలని కోరారు.
ఏసీపీ సంపత్‌రావు, సీఐ పులి రమేశ్, ఎస్సైలు రవీందర్, సురేశ్ పాల్గొన్నారు. అలాగే, నర్సంపేటలోని 24 వార్డుల్లో ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు. గీసుగొండ మండలంలోని 21 గ్రామాలతోపాటు గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొమ్మాల స్టేజీ వద్ద జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఎస్సై సందీప్‌కుమార్, విశ్వనాథపురం సర్పంచ్ అంకతీ నాగేశ్వర్రావు, నాయకులు రవీందర్‌రెడ్డి, స్వామిచౌహాన్, సుధాకర్, సుదర్శన్, రవీందర్, లక్ష్మణ్‌నాయక్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నర్సంపేట మండలంలోని 27 గ్రామాల్లో ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, తాసిల్దార్ వాసం రామ్మూర్తి, ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్, ఎస్సై బొజ్జ రవీందర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు సంతోష్‌బాబు, కొండల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి అనితారెడ్డి, సిబ్బంది తదితరులున్నారు. గుంటూరుపల్లిలో సర్పంచ్ కర్నాటి పార్వతమ్మ, కార్యదర్శి అజయ్‌కుమార్, రాజేశ్వర్రావుపల్లిలో సర్పంచ్ బొజ్జ యువరాజ్, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండాలను ప్రదర్శించారు.
చెన్నారావుపేట: వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. చెన్నారావుపేట ఎంపీడీవో కార్యాలయంలో త్రివర్ణ పతాకాల పంపిణీని ఆయన ప్రారంభించారు.
బుధవారం నుంచి గ్రామాల్లో ప్రతి ఇంటికీ జాతీయ జెండాను అధికారులు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, జడ్పీటీసీ పత్తినాయక్, ఎంపీపీ విజేందర్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, సర్పంచ్ కుండె మల్లయ్య, ఎస్సై తోట మహేందర్, ఎంపీడీవో, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ రవి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ తిరుపతి, యువ నాయకుడు కృష్ణచైతన్య పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమంలో భాగంగా వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో మువ్వన్నెల పండుగ సంబురం నిర్వహించారు. స్వాతంత్రోద్యమాన్ని, జాతీయ పతాకం గొప్పతనం గురించి వివరించారు.
ఈ సందర్భంగా సభకు వచ్చిన వారికి త్రివర్ణ పతాకాలను అందజేశారు. అందరి ఇళ్లల్లో ఎగురవేసి దేశ ఔన్నత్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు. కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.