తాడ్వాయి, జనవరి 11 : మేడారం జనసంద్రం అవుతున్నది. మహాజాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సమ్మక్క, సారలమ్మను తనివితీరా కొలిచేందుకు ప్రజలు బారులు తీరుతున్నా రు. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కావడంతో ఆదివారం ఒక్కరోజే సుమారు 3 లక్షల పైచిలుకు భక్తులు తరలివచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.
మొదట జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించిన భక్తులు, తల్లులకు తలనీలాలు సమర్పించిన అనంతరం గద్దెలకు చేరుకొని తల్లులకు ప్రీతికరమైన ఎత్తు బంగారం (బెల్లం), ఒడి బియ్యం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోళ్లు, యాటలు సమర్పించి, మేడా రం పరిసరాల్లో విందు భోజనాలు ఆరగించారు. ఒకవైపు అభివృద్ధి పనులు, మరోవైపు మంత్రుల రాకతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.