Suravaram Sudhaker Reddy | హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 23: ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు కూడు, గూడు కల్పించాలని ఎన్నో పోరాటాలు చేసిన పోరాటయోధుడు తన పదునైన మాటలతో కార్యకర్తలకు, నాయకులను చైతన్యపరుస్తూ భారతదేశంలోనే ఒక మంచి వక్తగా గుర్తింపు పొందిన మహానాయకుడు కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి అని కుమార్‌పల్లి బుద్ధభవన్ శాఖ సీనియర్ నాయకులు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ కుమార్‌పల్లి బుద్ధభవన్ శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సురవరం సుధాకర్‌రెడ్డి కామ్రేడ్ బీఆర్ భవన్దాస్ ఆత్మీయతతో ఎన్నో కార్యక్రమాలకు బుద్ధభవన్ వేదికగా ప్రసంగించారు. ఇక్కడి ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో కుమార్‌పల్లి బుద్ధభవన్ శాఖ సీనియర్ నాయకులు కోడం రాజలింగం, జి.కృష్ణమూర్తి, యాళ్ల ప్రకాష్, బూజుగుండ్ల గిరిధర్, పీసరి లక్ష్మణ్, యాళ్ల సంజయ్, కునమల్ల శంకర్, ఒగ్గుల కన్నీ, సోటాల వినయ్, సోటాల మురళి, గొర్రె ప్రవీణ్ పాల్గొన్నారు.