కమలాపూర్, సెప్టెంబర్ 12: కమలాపూర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల బీసీ గురుకుల విద్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య గురువారం రాత్రి బస చేశారు. జిల్లాలో తొలిసారి బాలికల విద్యాలయంలో బస చేసేందుకు కలెక్టర్ రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వసతిగృహం, నిత్యావసర సరుకులు, వంట గదిని కలెక్టర్ పరిశీలించారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ మెనూ ప్రకారం అన్నీ ఇస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గురుకుల పాఠశాల లేదా హాస్టల్లో బస కార్యక్రమంలో భా గంగా వచ్చినట్లు తెలిపారు. ఉదయం వి ద్యార్థులతో మమేకం కానున్నట్లు చెప్పిన కలెక్టర్.. స్కౌట్ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటిస్తూ భోజనం చేశారు.
అయితే కలెక్టర్ గురుకులంలో ఉండగానే 7:38 నుంచి 7:43 గంటల వరకు విద్యుత్ స రఫరా నిలిచిపోయి చీకటి అలుముకుంది. ఐదు నిమిషాల పాటు కరంటు పోవడంతో అధికారులు కంగారుపడ్డారు. కార్యక్రమం లో ఆర్డీవో వెంకటేశ్, డీఈవో వాసంతి, ఎం జేపీ ఆర్సీవో రాజ్‌కుమార్, ప్రిన్సిపాల్ సౌజ న్య, ఎంపీడీవో బాబు, తహసీల్దార్ సురేశ్‌కుమార్ తదితరులున్నారు.