దుగ్గొండి, మార్చి, 10 : రోడ్డు ప్రమాదంలో అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తొగరాయి గ్రామ శివారులో జరిగింది. స్థానిక ఎస్ఐ రావుల రణధీర్ రెడ్డి, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లి మండలం దస్తగిరి పల్లి గ్రామానికి చెందిన బొంతర బోయిన మనోహర స్వామి (26) ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన స్థానికులు కల్వర్టు పక్కన యువకుడు మృతి చెందిన సంఘటనను చూసి విషయం పోలీసులకు తెలిపారు.
మృతుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం కొమ్మాల జాతరకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి స్నేహితులతో కలిసి వెళ్లాడన్నారు. తమ కుమారుడు మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నామని, పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని మృతుడి తల్లి లక్ష్మి పిటిషన్లో పేర్కొన్నారు.