హనుమకొండ చౌరస్తా, మార్చి 25: చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు 7వ రోజు సీతారామచంద్రస్వామి వార్లకు అర్చనాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గుణదాముడుగా అలంకరించి ప్రముఖ కమ్మ సంఘం రాష్ర్ట నాయకుడు చిన్న కోనయ్య-ధనలక్ష్మి దంపతుల సౌజన్యంతో తూర్పుగోదావరి జిల్లా నుంచి తెప్పించిన లక్ష తులసీ దళాలతో లక్ష తులసి నామాలతో లక్ష తులసి దలార్చన నిర్వహించారు.
పాయసాన్న నైవేద్యం సమర్పించి నీరాజనం మంత్రపుష్పాలు అనంతరం యాగశాలలో నవగ్రహ రుద్రహోమ సహిత మహాసుదర్శన హోమం నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి డి.అనిల్‌కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్‌శర్మ, వైష్ణవ పండితుడు చెరుకుపల్లి శ్రీవాత్సవచార్యులు పాల్గొన్నారు.