నర్సింహులపేట జాన్ 8 : రోహిణి కర్తె ముగిసింది.. మృగశిర కార్త ప్రారంభమైన చినుకు జాడ లేకపోవడంతో రైతన్న ఎదురుచూపులు తప్పడం లేదు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రత ఒక్కరు దేవుడు కరుణించాలని.. వర్షాలు కురువాలని కోరుకుంటున్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా నరింహులపేట మండల కేద్రంతో పాటు, కొమ్ములవంచ గ్రామాల్లో ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు పని ముగిసిన తర్వాత చెరువుల్లో వానల్లో కురువాలి ఉయ్యాలో.. చెరువుల నిండాలి ఉయ్యాలో అంటూ లయబద్ధంగా పాడుతూ కోలాటం ఆడారు.
