నర్సంపేట రూరల్, ఏప్రిల్ 26 : ఉపాధి హామీ పనులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మహేశ్వరం, రాములునాయక్తండా, గురిజాల, ముగ్ధుంపురం, రామవరం గ్రామాల సర్పంచ్లు మాడ్గుల కవిత, అజ్మీర మాధవి, గొడిశాల మమత, పెండ్యాల జ్యోతి, కొడారి రవన్న కోరారు. సోమవారం మండలంలోని అన్ని గ్రామా ల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నా యి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధితో నిరుపేద కూలీలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : మండలంలోని పలు గ్రామాల ప్రజలు అధిక సంఖ్య లో హాజవడంతో ఉపాధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పాపయ్యపేట, జోజిపేట, సూర్యాపేట తం డా, కోరంకుంటతండా, ఈర్యా తం డా, శంకరంతండా, లింగగిరి, చెన్నారావుపేట గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలు ఫీడర్ ఛానల్ పనులు చేపట్టారు. ఆయా గ్రామాల్లోని పనులను ప్రజాప్రతినిధులు పరిశీలించారు. పాపయ్యపేటలో జరిగే పనులను సర్పంచ్ ఉప్పరి లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ పరిశీలించారు. కార్యక్రమంలో మేట్లు హంస చంద్రయ్య, బండి రమేశ్, టేకుల భారతి, రజని, బానోత్ మోహన్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
తగ్గేదే లే అంటోన్న రవితేజ..చేతిలో 5 సినిమాలు..!
పేరుకుపోతున్న మృతదేహాలు : పార్కులు, పార్కింగ్ సదుపాయాల్లోనూ అంత్యక్రియలు!