ఒక్క హిట్ వచ్చినందుకే ఇంత జోరు పెంచేస్తున్నాడా..? వామ్మో మాస్ రాజా మామూలోడు కాదు అంటున్నారు ఆడియన్స్. రవితేజ జోరు చూస్తుంటే ఇంతకంటే ఏం అంటారులే మరి..? మొన్న సంక్రాంతికి విడుదలైన క్రాక్ సంచలన విజయం సాధించింది. దాదాపు 38 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఆహాలో విడుదలైన తర్వాత అక్కడా సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా ఇచ్చిన ఊపులో వరస సినిమాలకు కమిట్మెంట్ ఇస్తున్నాడు మాస్ రాజా. ఇప్పటికే ఖిలాడి సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నాడు. రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ఇలా ఉండగానే మరో మూడు సినిమాలకు కూడా మాస్ రాజా కమిటయ్యాడు.
చాలా రోజులుగా వార్తల్లోనే ఉన్న త్రినాథరావు నక్కిన సినిమాను ఈ మధ్యే అధికారికంగా ప్రకటించారు. అభిషేక్ అగర్వాల్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. రామ్ హలో గురు ప్రేమకోసమే సినిమా తర్వాత వీళ్లు చేస్తున్న సినిమా ఇదే. రవితేజ ఎనర్జీకి తగ్గట్లుగానే ఈ సినిమా ఉండబోతుందంటున్నాడు దర్శకుడు త్రినాథరావు. ఇందులో లాయర్ గా నటించబోతున్నాడు రవితేజ.
ఈ సినిమాతో పాటు ఈ మధ్యే కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు ఓకే చెప్పాడు. ఇది కూడా పక్కాగా కమర్షియల్ సినిమా అని తెలుస్తుంది.ఈ రెండు సినిమాలు ఇలా ఉండగానే ఇప్పుడు మరో సినిమాకు కూడా రవితేజ ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మారుతి సినిమా సైతం ఈయన చేతుల్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. గోపీచంద్ పక్కా కమర్షియల్ అయిపోయిన తర్వాత రవితేజ సినిమా మొదలు కానుంది. ఇక దాంతో పాటు తాజాగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు కమిటయ్యాడు రవితేజ.
కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రక్ష లాంటి సినిమాలతో ఈయన గుర్తింపు తెచ్చుకున్నాడు. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కోసం గతంలో రానా, బెల్లంకొండ శ్రీనివాస్ ను అనుకున్నాడు ఈ దర్శకుడు. వాళ్లు నో చెప్పడంతో మాస్ రాజా దగ్గరికి ఈ ప్రాజెక్టు వచ్చింది. వీళ్ళతో పాటు బోయపాటి శ్రీనుతోనూ రవితేజ సినిమా ఉంటుందనే టాక్ వస్తుంది. ఏదేమైనా అరడజన్ సినిమాలతో రవితేజ మళ్లీ బ్యాక్ టూ ఫామ్ అయిపోయాడు.
ఇవి కూడా చదవండి..
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…