కాశీబుగ్గ : నగరంలోని ఓసిటి మైదానంలో శనివారం రాత్రి రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం చేసినట్లు డీవైఎస్ఓ ఇందిర పేర్కొన్నారు. ఈ క్రీడలు తెలంగాణ రాష్ట్ర రూరల్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కబడ్డి, ఖోఖో, వాలీబాల్, క్రికేట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడకారులు క్రీడాతో పాటు చదువులో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో జుడో ఫేడరేషన్ ఆఫ్ ఇండియా కోశాధికారి బైరబోయిన కైలాస్ యాదవ్, శివకుమార్, సూరం శంకర్రావు, ధన్‌రాజ్, కంచు శ్రీనివాస్, ప్రేమ్‌కుమార్, సంతోష్‌కుమార్, మహేష్, లింగమూర్తి, రాజులు పాల్గొన్నారు.