నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 2: జిల్లాలో శనివారం ఉగాది ఉగాది ఉత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరానికి(శ్రీ శుభకృత్) స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయాలకు చేరుకొని పూజలు చేశారు. సాయంత్రం వేళ పండితులు పంచాంగ పఠనం చేశారు. హనుమకొండ టీఎన్జీవో భవన్లో ఉగాది పంచాంగ పఠనం జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ హాజరయ్యారు. కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ మాట్లాడుతూ శుభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు ఆయురారోగ్యాలతో ఆనందంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరికీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ హనుమకొండ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రామ్‌కిషన్, భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జనగాం జిల్లా అధ్యక్షుడు అంజద్అలి, టీఎన్జీవో హనుమకొండ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు పుల్లురు వేణుగోపాల్, కోశాధికారి పనికెల రాజేశ్, కేంద్ర సంఘం నాయకులు కొల రాజేశ్ కుమార్, శ్యామ్ సుందర్, కత్తి రమేశ్, సారంగపాణి, సలీం, మోయిజ్, చీకటి శ్రీనివాస్, రాజమౌళి, సురేశ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కాజీపేట పట్టణంలో ఉగాది వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.భీమదేవరపల్లిలో మండలంలోని అన్ని ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. ఇంటి వద్ద షడ్రుచులతో సమ్మిళితమైన ఉగాది పచ్చడిని సేవించారు. అనంతరం ఆలయాల్లో పూజారులు నూతన పంచాగాన్ని చదివి వినిపించారు. ఎంపీపీ జక్కుల అనిత రమేశ్, జడ్పీటీసీ వంగ రవి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు మార్పాటి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎల్కతుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉగాది సంబురాలు నిర్వహించారు.
ఆదాయ, వ్యయాలు, గౌరవం, అవమానాల గురించి పూజారులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పని ముట్లతో పాటు ఆవులు, ఎద్దులకు పూజలు చేసి పంటలు బాగా పండాలని వేడుకున్నారు. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. కమలాపూర్ మండల కేంద్రంతోపాటు ఉప్పల్, శనిగరం, మర్రిపెల్లిగూడెం, వంగపల్లి, గూడూరు, కన్నూరు, శ్రీరాంలపల్లి, గోపాల్పూర్, శంభునిపల్లి, కానిపర్తి, భీంపల్లి తదితర గ్రామాల్లో ఉగాది వేడుకలు నిర్వహించారు. ధర్మసాగర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఉగాది పచ్చడి తయారు చేసి సేచించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అర్చకులు పంచాంగ పఠనం చేశారు. ధర్మసాగర్‌లోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకులు నర్సింహస్వామి శర్మ పంచాగం చదివి వినిపించారు. నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషలతో పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేవునూర్‌లో అర్చకుడు బొమ్మనవంచ శ్రీనివాస్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. సర్పంచ్ కవిత, కుమార్, రవి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆత్మకూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో సర్పంచ్ వంగాల స్వాతి భగవన్‌రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ఆరుట్ల మాధవమూర్తి పంచాంగ శ్రావణం చేశారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ బయ్యరమారాజు, కోఆప్షన్ మెంబర్ ఎండీ అంకుస్, పీఏసీఎస్ డైరెక్టర్ వీర్ల వెంకటరమణ, వార్గు సభ్యులు పాపని రవీందర్, బైగాని రాజేందర్, కాడబోయిన రవి, పొదిల సదయ్య, రేవూరి అపర్ణ, రేవూరి ప్రవీణ్‌రెడ్డి, రేవూరి జయశ్రీ, నత్తి రవీందర్, మాజీ ఉపసర్పంచ్ రేవూరి సంపత్‌రెడ్డి, పూజారి రాము, మత్స్యశాఖ పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు బయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు. దామెర మండలంలో ఉగాది వేడుకలను ఆనందంగా నిర్వహించారు. ఊరుగొండలో లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకుడు తూపురాణి శ్రీనివాసాచార్యులు, కోగిల్వాయిలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు దివి వెంకట జోగాచార్యులు, కేశవాచార్యులు, పులుకుర్తిలోని ఆంజనేయస్వామి, శివాలయం వద్ద ఆర్చకులు అఖిల కుమారాచార్యులు పంచాంగ పఠనం చేశారు. ఓగులాపురం, తక్కళ్లపహాడ్, ముస్త్యాలపల్లి, వెంకటాపురం, దామెర, ల్యాదెళ్ల, సీతారాంపురం, దుర్గంపేట, సింగరాజుపల్లి, పసరగొండ, దమ్మన్నపేటలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ కల్పన, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పోలం కృపాకర్ రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నడికూడ మండలం వరికోల్ గ్రామంలో రామలింగేశ్వర దేవస్థాన చైర్మన్ పోశాల అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి శ్రీనివాస భట్టాచార్యులుచే పంచాంగ శ్రవణం ఏర్పాటుచేశారు. చైర్మన్ అశోక్ గ్రామస్తులకు ఉగాది పచ్చడి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సాధు నిర్మల సమ్మిరెడ్డి, వైస్ ఎంపీపీ చంద కుమారస్వామి, ఉప సర్పంచ్ సుమలత రఘు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు డైగ రాజు, ఆలయ వైస్ చైర్మన్ మూరాల రవీందర్, కార్యదర్శి ఓరుగంటి శ్రీనివాస్, కోశాధికారి దొగ్గెల కుమారస్వామి, ఆకునూరి రమేశ్, కార్యవర్గ సభ్యులు పోచంపల్లి రాజిరెడ్డి, గుగ్గిళ్ల శరత్ కుమార్, ఓరుగంటి శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు. వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గట్టు మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో పంచాగ పఠనం చేశారు. వినిపించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎస్సై నవీన్‌కుమార్ ఆలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రవియాదవ్, ధర్మకర్తలు అమర్‌సింగ్, సాయిమల్లు, నర్సింహరావు, సూత్రపు సంపత్, నార్లగిరి ప్రవీణ్, ఆత్మ జిల్లా చైర్మన్ కీర్తి వెంకటేశ్వర్లు, విజేందర్‌రెడ్డి, అర్చకులు వినయ్‌శర్మ, మహేశ్‌శర్మ, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.
పరకాల పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర ఆలయంలో శైవాగమ పండితుడు కోమాళ్లపల్లి సంపత్‌కుమార్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు, ఆలయ అర్చకులు కోమాళ్లపల్లి నాగభూషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి నిర్వహించారు. దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి, జిల్లా ప్రతాప్ సేనా రెడ్డి, లెకల జలంధర్‌రెడ్డి, సామల సదానందం, రవీందర్, సురేశ్, రాజేందర్, చంద్రమౌళి పాల్గొన్నారు.గ్రేటర్ 31వ డివిజన్ న్యూశాయంపేటలోని శ్రీవేదాద్రి సంతోష లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్చకుడు జీదికంటి కృష్ణ పూజలు చేశారు. ఉగాది పచ్చడి ప్రసాదంగా అందజేశారు. భక్త జన సందోహం మధ్య కోలాటాలతో గిరిప్రదక్షణ నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గ్రంధి సూర్యనారాయణ, సత్యవతమ్మతో పాటు కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ వేల్పుల మోహన్‌రావు, భారతాల వెంకన్న యాదగిరి తదితరులు పాల్గొన్నారు.