సంగెం, జనవరి 25 : భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కు ఒక వజ్రాయుధమని ఆర్డీవో మహేందర్‌జీ పేర్కొన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్డీవో హాజరై కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేంద్రనాద్, డీటీ రాజేశ్వర్‌రావు, ఆర్ఐ రమేశ్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎంజీఎంలో ..
వరంగల్ చౌరస్తా: ఎంజీఎంలో జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంగళవారం ఎంజీఎం సూపరింటెండెంట్ బత్తుల శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది చేత ఆయన ప్రతి జ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవో డా క్టర్ మురళి, సాంబరాజు, అడిషినల్ ఆర్ఎంవో ప్రసాద్, కొవిడ్ స్పెషల్ ఆఫీసర్ కేశవరావు, పలువురు వైద్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో..
వరంగల్ జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎంహెచ్‌వో కాజీపేట వెంకటరమణ ఉద్యోగులు, సిబ్బంది చేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కా ర్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ చం ద్రకళ, సీహెచ్‌వో జ్ఞానసుందరి, ఉద్యోగులు శ్రీనివాస్, సదానందం, రామ లింగయ్య, విజయలక్షిమ, రాధిక, త్రివేణి, వెంకన్న, నితిన్ పాల్గొన్నారు.
కరీమాబాద్‌లో..
కరీమాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ ఫణికుమార్ తెలిపారు. జా తీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని మం గళవారం పెరుకవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహింంచారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేంలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సూ ర్య, అంగన్వాడీలు భాగ్యలక్ష్మి, శారద, భవాని, సు జాత, జయ, జ్యోష్ణ, శశికళ పాల్గొన్నారు.
వరంగల్ తహసీల్‌లో ..
పోచమ్మమైదాన్: జాతీయ ఓటర్ల దినోత్సవం సం దర్భంగా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది మంగళవారం ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ సత్యపాల్‌రెడ్డి సిబ్బందితో జాతీయ ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ చే యించారు. ఈ సందర్భంగా నూతన ఓటరు ఓట రు కార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామాల్లో జాతీయ ఓటర్ దినోత్సవం
నర్సంపేట రూరల్: మండలంలోని అన్ని గ్రామా ల్లో మంగళవారం జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ అధికారుల సమక్ష్యంలో గ్రామాల్లో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు చేపట్టారు. పట్టణంలోని మండల తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ వాసం రా మ్మూర్త్తి, డీటీ ఉమారాణి, జూనియర్ అసిస్టెంట్ పీ రంజిత్ ఆధ్వర్యంలో ఓటర్ దినోత్సవం సందర్భం గా ప్రతిజ్ఞ చేపట్టారు. రెవెన్యూ అధికారులు గ్రా మాల్లోని ప్రధాన వీధుల్లో ఓటర్ అవగాహన ర్యాలీ లు తీశారు. అనంతరం ప్రధాన కూడళ్లలో మానవహా రం నిర్వహించారు. మాధన్నపేటలో సర్పంచ్ మొ లుగూరి చంద్రమౌళి, ఎంపీటీసీ రాంబాబు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మారపాక నర్స య్య, నర్సయ్య, సాంబయ్య, రమేశ్, రా జు, రాజేందర్ ఆధ్వర్యంలో ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. అదేవిధంగా అన్ని పంచాయతీలో జాతీయ ఓటర్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఖానాపురంలో..
ఖానాపురం: మండలకేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ జులూరి సుభాషిణీ, బుధరావుపేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీపీ ప్ర కాశ్రావు ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుభాషిణి రెవెన్యూ సిబ్బందితో ప్రతిజ్ఞ చే యించారు. అదేవిధంగా బుధరావుపేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ షేక్ యా కూ బ్ అలీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీవెంకటనర్సయ్య, సర్పంచ్ కాస ప్రవీణ్‌కుమార్, డీటీ సృజన్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తిలో..
రాయపర్తి: ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానంలో ప్రజల చేతిలో వజ్రాయుధం ఓటు హక్కు అని తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్ర జాపరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో మండలంలోని అన్ని గ్రామాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఓటు హక్కు ప్రాముఖ్యత-వినియోగించుకునే విదానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, ఎంపీడీవో గుగులోతు కిషన్‌నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎం నర్సింహ్మానాయక్, సర్పంచ్‌లు గారె నర్సయ్య, కే రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట: మండల కేంద్రంలోని తహసీల్దార్ కా ర్యాలయంలో తహసీల్దార్ పవన్‌కుమార్, ఎన్నికల నయాబ్ తహసీల్దార్ హారతి ఆధ్వర్యంలో కా ర్యాలయ అధికారులు, సిబ్బంది ఓటరు ప్రతిజ్ఞ చేశారు. అలాగే మండలంలోని ఆయా గ్రామాల్లో ఎన్నికల బూత్ లెవెల్ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల సిబ్బంది ఓటరు ప్రతిజ్ఞ చేశా రు. ఈ కార్యక్రమాల్లో ఎన్నికల అధికారులు, సిబ్బంది, గ్రామాల ప్రముఖులు పాల్గొన్నారు.
ఓటుతో సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలి
నర్సంపేట: ఓటు ద్వారానే సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, కేయూ పాలక మండలి సభ్యుడు బత్తిని చం ద్రమౌళి అన్నారు. మంగళవారం నర్సంపేటలోని కళాశాలలో ఓటరుదినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 18 ఏండ్లు నిండిన ప్రతి యువకుడు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శైలజ, సమ్మ య్య, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ గతిని మార్చేది ఓటు ఒక్కటే..
నల్లబెల్లి : ప్రపంచ గతిని మార్చే శక్తి ఒక్క ఓటుకే ఉందని తహసీల్దార్ దూలం మంజుల అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకుని తహసీల్దార్ తోపాటు కార్యాలయం సిబ్బంది ఓటు హక్కును ప్రలోబాలకు గురి కాకుండా వినియోగిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజేంద్రప్రసాద్, వీఆర్వోలు సదానందం, ఆర్ ప్రసాద్, రవీందర్ పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ భన్సీలాల్నాయక్ సూచించారు. మంగళవా రం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ భన్సీలాల్నాయక్ కార్యాలయ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీటీ మధుసూదన్, గిర్ధావర్ స్వామి, కార్యాలయ సిబ్బంది, వీఆర్ఏలు పాల్గొన్నారు. అలాగే, మండలంలోని తిమ్మరాయనీపహాడ్ గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సర్పంచ్ కొండవీటి పావనీ జీపీ సిబ్బంది, గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పంచాయతీకార్యదర్శి మమ త, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ కొండవీటి ప్రదీప్‌కుమార్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రెడ్డిమాస్కిశోర్, జీపీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
గీసుగొండ: ఓటు హక్కు వజ్రయుధం లాం టిదని తహసీల్దార్ సుహాసిని అన్నారు. తహసీల్ కార్యాలయంలో మంగళవారం జాతీయ ఓటు హ క్కు దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ రం జిత్కుమార్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, వీఆ ర్వోలు, బీఎల్వోలు పాల్గొన్నారు.